Ads
నిత్యం స్వామి వారిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు తిరుమల వెళుతూ ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుణ్యక్షేత్రాలలో అతి పెద్ద పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది తిరుపతి. చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు.
కాలినడకని కూడా చాలామంది భక్తులు వచ్చి వారి మొక్కులని తీర్చుకుంటూ ఉంటారు అయితే శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరాన్ని అలంకరిస్తూ ఉంటారు. ఎందుకు అలా అలంకరిస్తారు..? దాని వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం..
శ్రీవారి భక్తులలోనే అగ్రగణులు అనంతాళ్వారు. ఆయన తన సేవలతో శ్రీవారిని ఆరాధిస్తూ వుంటారు. ఈయన కొండ పైన వెనక భాగంలో ఉండేవారు. ప్రతిరోజూ పూలమాలలు ని కూడా సమర్పించేవారు.
ఒక రోజు పూలతోటను పెంచాలని అనుకోగా… అందుకు సరిపడా నీళ్లు ఉండాలని.. దాని కోసం ఒక చెరువును త్రవ్వాలని అనుకోగా… చెరువును తవ్వడం మొదలు పెడతాడు.
భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును త్రవ్వడం మొదలు పెడతారు. అయితే అలా చేస్తున్న సమయంలో
అనంతాళ్వారుని భార్య గర్భవతి. అతనేమో గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తుంటే.. ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేయడం జరుగుతోంది. అంతా చూస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకున్నారు. అప్పుడు ఆయన 12 సంవత్సరాలు బాలుని రూపంలో వెళ్తాడు.
Ads
గర్భిణిగా ఉన్న ఆమె దగ్గరికి వెళ్లి సాయం చేస్తానని చెప్పి మట్టిని నేను పారబోస్తా అని చెప్తారు. ఇలా బాలుడు ఆమెకు సాయం చేస్తాడు. ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టని తీసుకెళ్ళి ఇస్తే బాలుడు పారబోస్తూ ఉంటాడు. అనంతాళ్వారులు అది చూసి కోప్పడతాడు. అనంతాళ్వారులు ఆ కోపం లో చేతిలో ఉన్న గునపాన్ని బాలుడి మీదకి విసురుతాడు.
అదేమో బాలుడు గడ్డానికి తగులుతుంది. ఆ బాలుడు రూపంలో వచ్చిన వెంకటేశ్వరస్వామి వారు ఆనంద నిలయంలోకి వెళ్ళిపోతారు. మాయం అయిపోతారు. అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారటం ని చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతాళ్వారుకు చెప్తారు.
అది విని కంగారు కంగారుగా అక్కడికి చేరుకుంటాడు. ఆ బాలుడే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరస్వామి వారు అని గ్రహించి కన్నీళ్ళతో స్వామివారిని మన్నించమని పాదాల పై పడి ఏడుస్తాడు. ఆ గాయం తగలడంతో గడ్డం వద్ద పచ్చకర్పూరం పెడతాడు. అప్పటి నుండి కూడా గాయంపై చందనం రాసి పచ్చకర్పూరం పెట్టేవాడు. ఇది ఆనాటి నుండి అక్కడ జరుగుతూనే వుంది.