20 ఏళ్ల తర్వాత “కమల్ హాసన్” తో మళ్ళీ జతకడుతున్న హీరోయిన్…ఎవరో గుర్తుపట్టారా.?

Ads

విశ్వనటుడు కమల్ హాసన్ గురించి మనందరికీ తెలిసిందే. కమల్ హాసన్ నటించిన విరుమాండి సినిమా అభిమానులకు గుర్తుండే ఉంటుంది. ఇక ఆ సినిమాలో కమల్ హాసన్ సరసన హీరోయిన్ గా అభిరామిని నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించడంతో ఇద్దరికీ మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమా 2004లో విడుదలైన విషయం తెలిసిందే. కాగా కమల్‌ హాసన్‌ నాయగన్‌ వంటి సెన్సేషనల్‌ హిట్‌ చిత్రం తరువాత మరోసారి మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే.

దీనికి థగ్‌ లైఫ్‌ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. అయితే ఈ సినిమాను రెడ్‌ జెయింట్‌ మూవీస్, రాజ్‌ కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా మూవీలో హీరోయిన్‌ త్రిష, నటుడు జయం రవి, దుల్కర్‌ సల్మాన్‌ వంటి స్టార్స్‌ ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీలో సీనియర్ నటి అభిరామి భాగమయ్యిందట. ఈ విషయం గురించి ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…

Ads

నేను కమల్‌ హాసన్‌ జంటగా నటించిన విరుమాండి సినిమా విడుదలై 20 ఏళ్లు అయింది. మళ్లీ ఇప్పుడు థగ్‌ లైప్‌ చిత్రంలో ఆయనతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ మూవిలో తన పాత్ర గురించి దర్శక నిర్మాతలే ప్రకటిస్తారు.

విరుమాండి చిత్రం 2004లో పొంగల్‌ సందర్భంగా విడుదలైందని, ఇప్పుడు థగ్‌ లైప్‌ చిత్రం షూటింగ్‌ 2024 పొంగల్‌ సందర్భంగా ప్రారంభం కాబోతోంది అని అభిరామి తెలిపింది. కాగా ఏఆర్‌ రెహమాన్‌ ఈ మూవికి సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్, ప్రోమో ఇటీవలే రిలీజై అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, అభిరామిని నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Previous articleగూఢచారి 2 లో హీరోయిన్ ఈమెనే…చూడడానికి శోభిత ధూళిపాళ్లలానే ఉందిగా..! ఎవరంటే.?
Next article500 టన్నులు అది ఇచ్చి…ఐపీఎల్ లో ఆ పాక్ ప్లేయర్ ని కొన్న RCB .! ఇదెక్కడి ట్రోల్ రా మావా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.