Ads
సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడం అంత సులభమైన విషయం కాదు. ఇక హీరోగా ఛాన్స్ పొందడం, స్టార్ హీరోగా ఎదిగి ముప్పాయికి పైగా సినిమాలలో నటించడం గొప్ప విషయం అని చెప్పవచ్చు.
అలాంటి స్థాయికి వెళ్ళిన తరువాత సినిమాలను ఎవరూ విడిచిపెట్టరు. అయితే ఇదనుకు భిన్నంగా ఒక యంగ్ టాలీవుడ్ హీరో తన కెరిర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సమయంలోనే ఇండస్ట్రీని విడిచిపెట్టాడు. ప్రస్తుతం చర్చిలో పాస్టర్‌గా కొనసాగుతున్నారు. ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఇరవై ఏళ్ళ క్రితం ఒక యంగ్ హీరో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కెరీర్ మొదట్లోనే నేచురల్ యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. రెండవ మూవీతో మెయిన్ హీరోగా అవకాశం అందుకున్నా, నాలుగవ మూవీతో ఇండస్ట్రీని, ఆడియెన్స్ ను తన వైపు చూసేలా చేశాడు. ఆ హీరో చూడటానికి కూల్ గా కనిపించడంతో ఫ్యామిలీ మరియు యూత్ లో కూడా మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆ హీరో మరెవరో కాదు హీరో రాజా హెబెల్.
ఓ చినదాన మూవీతో హీరో శ్రీకాంత్ తో పాటు, సెకండ్ హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత హీరోగా రెండు సినిమాలు చేసినా, దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఆనంద్ మూవీతో మొదటి విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీతో అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కాకుండా యూత్ ను కూడా ఆకట్టుకున్నాడు. ఆ తరువాత వరుస సినిమాలలో నటించాడు. మంచి యాక్టర్ గా, పక్కింటి కుర్రాడిలా ఉండే రాజా, హీరోగానే కాకుండా కీలక పాత్రలలో కూడా నటించారు.
ఆ నలుగురు, అర్జున్ మూవీలో నటించాడు. అయితే చేతి నిండా సినిమాలు ఉన్న టైమ్ లో రాజా యాక్టింగ్ స్వస్తి పలికి ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ఆ తర్వాత పాస్టర్‌గా మారాడు. ఆయన ప్రస్తుతం ముషిరాబాద్ లో ఉన్న ‘ద న్యూ కెవినెన్ట్ చర్చ్’ లో పాస్టర్‌గా ఉన్నారు. అసలు పేరు కృష్ణమూర్తి. రాజా బ్రాహ్మణ కుటుంబానికి చెందినప్పటికీ, చిన్నప్పుడే తల్లి చనిపోవడం, ఆ తరువాత తండ్రి దూరం కావడంతో క్రిష్టియన్‌గా మారారు. కృష్ణమూర్తిని కాస్త రాజా హెబెల్ గా మార్చుకున్నారు.
Ads
Also Read: జాన్వీ కపూర్ దగ్గర ఉన్న 12 అత్యంత ఖరీదైన వస్తువులు ఏమిటో తెలుసా?