Ads
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడి సినిమా విడుదల అయ్యింది. ఎంతో మంది ప్రముఖులు సినిమాని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాలో ఎంతో మంది తెలిసిన నటీనటులు ఉన్నారు. దీపికా పదుకొనే, దిశా పటానీతో పాటు, హీరోయిన్ శోభన, అలాగే మరొక హీరోయిన్ కూడా కనిపించారు. కైరా పాత్రలో ఈ హీరోయిన్ నటించారు. సినిమాలో కనిపించినంత సేపు కూడా ఈమె హైలైట్ అయ్యారు. ఈ నటి పేరు అన్నా బెన్. అన్నా బెన్ ఒక మలయాళం నటి.
అన్నా బెన్ తండ్రి బెన్నీ పి. నాయరాంబళం మలయాళంలో ఒక స్క్రీన్ రైటర్. 2019 లో వచ్చిన కుంబలాంగి నైట్ సినిమాతో అన్నా బెన్ కెరీర్ మొదలుపెట్టారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వడంతో, అన్నా బెన్ కి చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత హెలెన్, కప్పేలా, సారా’స్, నారదన్, నైట్ డ్రైవ్, కాపా, త్రిశంకు సినిమాల్లో నటించారు. ఇవన్నీ మలయాళం సినిమాలు. ద అడమెంట్ గర్ల్ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు కల్కి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టారు. ప్రతి సినిమాలో తన పాత్రకి ప్రాముఖ్యత ఉండేలాగా చూసుకుంటారు అన్నా బెన్.
Ads
ఇప్పటి వరకు తను నటించిన సినిమాలన్నీ కూడా అన్నా బెన్ కి చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. అందులోనూ ముఖ్యంగా హెలెన్, కప్పేలా సినిమాలు అయితే ఇతర ఇండస్ట్రీలో వాళ్లు కూడా సినిమాలని, అన్నా బెన్ నటనని మెచ్చుకున్నారు. ప్రస్తుతం అన్నా బెన్ రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు కల్కి సినిమా తర్వాత తెలుగులో కూడా ఫేమస్ అయిపోయారు. తెలుగులో కూడా అవకాశాలు వస్తాయి ఏమో. ఎందుకంటే, ఆమె పోషించిన కైరా పాత్ర చాలా మందికి నచ్చింది. ఆమె కోసమే సినిమాకి వెళ్తున్న ప్రేక్షకులు కూడా ఉన్నారు.
గెటప్ కూడా ముందు సినిమాలతో పోలిస్తే చాలా కొత్తగా అనిపించింది. అన్నా బెన్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ తాను దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఈ సినిమాకి షూట్ చేశాను అని, సినిమా చాలా బాగా వచ్చింది అని చెప్పారు. కానీ తన పాత్ర గురించి అప్పుడు చెప్పలేదు. సినిమా చూశాక ఆమె నటనని అందరూ అభినందించారు. అన్నా బెన్ ఇప్పుడు ఇంకా పాపులర్ అయిపోయారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.