Ads
తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖైదీ. ఈ మూవీ 2019 లో రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ మూవీతోనే లోకేష్ కనగరాజ్ కు భాషతో సంబంధం లేకుండా చాలా మంది అభిమానులు అయ్యారు.
ఈ మూవీ తెలుగులో విడుదల అయ్యి, ఇక్కడా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటించిన నటినటులందరికి మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా నెపోలియన్ పాత్రను ప్రేక్షకులు మరచిపోలేరు. మరి ఆ పాత్రలో నటించిన నటుడు ఎవరో ఇప్పుడు చూద్దాం..
లోకేష్ కనగరాజ్ సినిమాలు పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తారు. యాక్షన్ సీన్స్ ను స్టైలిష్ మరియు కొత్తగా తెరకెక్కించడంతో పాటు, రేసీ స్క్రీన్ ప్లేతో స్టోరీని నడిపించడంతో డైరెక్టర్ లోకేష్ కు తెలుగులోనూ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. లోకేష్ తెరకెక్కించిన రెండవ సినిమా ఖైదీ. ఈ చిత్రంలో కార్తీని సరికొత్తగా చూపించారు. ఈ మూవీలో గుర్తింపు పొందిన పాత్ర కానిస్టేబుల్ నెపోలియన్ ది అని చెప్పవచ్చు. ఈ పాత్రలో నటించిన యాక్టర్ పేరు జార్జ్ మేరియన్.
జార్జ్ మేరియన్ తమిళ నటుడు. ఆయన 1963లో మార్చి 23న చెన్నైలో జన్మించారు. సహాయక నటుడు మరియు హాస్య నటుడుగా అనేక తమిళ చిత్రాలలో నటించారు. జార్జ్ 1989లో థియేటర్‌లో నటుడిగా తన కెరీర్ ను ప్రారంభించాడు. 2002 వరకు నాటకాల్లో నటించాడు. ఆ తర్వాత, తమిళ సినిమాల్లో నటించడం ప్రారంభించాడు. ఎక్కువగా AL విజయ్, శివ, మణికందన్, లోకేష్ కనగరాజ్, తంగర్ బచ్చన్, సుందర్ C, ప్రియదర్శన్‌ల చిత్రాలలో నటించారు.
2008లో ప్రియదర్శన్ తెరకెక్కించిన కాంచీవరంలో జార్జ్ బంబుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఆ పాత్రతో మంచి గుర్తింపును పొందారు. అప్పటి నుండి వరుస సినిమాలలో నటిస్తూ ప్రముఖ నటుడిగా కోలీవుడ్ లో ఎదిగారు. ఎన్నో అవార్డులను అందుకుని కెరీర్ లో రాణిస్తున్నారు.
Ads
Also Read: “లియో” మూవీలో ఈ పొరపాటును గమనించారా..? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?