“బేబీ”లో “వైష్ణవి” భర్తగా నటించిన ఇతను ఎవరో తెలుసా.? ఆ డైరెక్టర్‌ తమ్ముడు.!

Ads

‘బేబి’ చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇందులో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించగా.. ఈ మూవీ జులై 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. షార్ట్ అండ్ స్వీట్ టైటిల్ తో వచ్చిన ఈ చిత్రం అంచనాలను మించి ప్రేక్షకాదరణ పొందింది. ఓటిటీ లో కూడా ఈ సినిమా కి పాజిటివ్ టాక్ వచ్చింది.

ఇందులో హీరోయిన్‌గా చేసిన వైష్ణవి చైతన్య.. మొదటి సినిమాతోనే ఓవర్‌ నైట్‌ స్టార్‌‌గా పేరు సంపాదించుకుంది. అదేవిధంగా ఎప్పటినుంచో తెలుగు నుంచి హీరోయిన్లు రావడం లేదనే వార్తను సైతం వైష్ణవి తిప్పికొట్టింది. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవి చైతన్య పేరు మార్మోగుతోంది.

అదే విధంగా ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ యూట్యూబ్, షార్ట్ ఫిలిమ్స్‌లో నటించింది. మొదట ‘అల వైకుంఠపురం’లో సినిమాలో అల్లు అర్జున్ చెల్లెల్లిగా కనిపించిన వైష్ణవి.. ఒక్కసారిగా బేబీ సినిమాలో హీరోయిన్‌గా నటించి తన నటనతో కట్టిపడేసింది. బేబీ మూవీకి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు.

ఈ మూవీలో నటించిన వారందరికీ మంచి గుర్తింపు వచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండి, ఎన్నో సినిమాలలో నటించినా రాని గుర్తింపు ఈ సినిమాతో వచ్చిన నటీనటులు చాలామంది ఉన్నారు. వారి గురించి మూవీ రిలీజ్ అయిన సమయంలో వైరల్ కూడా అయ్యారు. కానీ మూవీ క్లైమాక్స్ లో వైష్ణవి చైతన్య పెళ్లి చేసుకున్న నటుడు ఎవరు అనేది మాత్రం చాలా రోజుల వరకు తెలియలేదు. ఆ పెళ్లికొడుకు సెకన్లపాటే కనిపించినా బాగా వైరల్ అయ్యాడు.

ఆ అభాగ్యుడు ఎవరు? అంటూ సోషల్ మీడియాలో మీమ్స్‌ వచ్చాయి. అయితే బేబిని పెళ్లి చేసుకున్న నటుడు ఎవరో ఫైనల్‌గా తెలిసింది. ఆ నటుడి పేరు మల్లిడి కృష్ణ. తన నేటివ్ తూర్పు గోదావరి జిల్లా. అతను ఎవరో కాదు. బింబిసార మూవీ డైరెక్టర్ వశిష్ట సోదరుడు.

బేబీ అతని మొదటి సినిమా కాదు. ఎన్నో సినిమాలలో నటించాడు. మల్లిడి కృష్ణ కలర్‌ ఫోటో మూవీలో హీరో సుహాస్ కి సీనియర్ గా నటించాడు. కానీ అంతగా గుర్తింపు రాలేదు. డైరెక్టర్ సాయి రాజేష్ బేబీ మూవీలో హీరోయిన్ ను పెళ్లి చేసుకునే క్యారెక్టర్ ఇచ్చాడంట. సెకన్ల పాటు మాత్రమే కనిపించినా మల్లిడి కృష్ణకు మంచి గుర్తింపు వచ్చింది.

ALSO READ: “బేబీ” సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన ఈ అమ్మాయి రియల్ లైఫ్ లో ఎలా ఉంటుందో తెలుసా.?

Previous articleసైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన డైరెక్టర్ శంకర్, ఖైదీ ఫేమ్ అర్జున్‌దాస్ సినిమా…చూసారా.?
Next articleఇంక ఇతను వెళ్లి ఐపీఎల్ లోనే ఆడుకోవడం మంచిది అనుకుంటా.? వన్ డే లకు వేస్టేనా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.