Ads
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐశ్వర్యా ఇటీవల కాలంలో వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒక సినిమా ఇంకా విడుదల కాకముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలె మలయాళంలో పులిమడ అనే ఒక చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్ గా, మలయాళ హీరో జోజు జార్జ్ హీరోగా వచ్చిన ఈ థ్రిల్లర్ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. కానీ బాక్సాఫీసు వద్ద మాత్రం అంతగా అలరించలేకపోయింది.
Ads
కాగా ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్, జు జార్జ్ లతో పాటు చంబన్ వినోద్ జోసే, లిజోమోల్ జోసే, జాఫర్, జానీ ఆంటోని, చంద్రమేనన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే ఇషాన్ దేవ్ సంగీతం అందించగా వేణు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. అలాగే ఏకే సజన్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకోగా రాజేష్ దామోదరన్, సిజో వడక్కన్ లు నిర్మాతలుగా వ్యవహరించారు. స్క్రీన్ ప్లే తో పాటు డైరెక్షన్ పనులను కూడా ఏకే సజన్ యే నిర్వర్తించారు. అయితే ఈ సినిమా కథ బాగున్నప్పటికీ థియేటర్ లో మాత్రం పెద్దగా ఆడలేదు. కాగా అక్టోబర్ 26వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా నెలరోజులుగా కూడా కాక ముందే ఓటీటీ లోకి వచ్చేసింది.
బాక్సాఫీసు దగ్గర భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టడంలో విఫలం అయ్యింది. అయితే ఈ సినిమా విడుదల అయ్యి నాలుగు వారాలు గడవగానే అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో నేటి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళ భాషలో తీసిన ఈ చిత్రానికి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.