Ads
తెలుగు సిని పరిశ్రమలో పేరు గాంచిన కుటుంబాలలో నందమూరి, అక్కినేని, ఘట్టమనేని, మెగా, దగ్గుబాటి, మంచు కుటుంబాలు ముఖ్యమైనవి. ఈ కుటుంబాలలో అక్కినేని మరియు మంచు కుటుంబాలకి ఆ ఒక్కటి మాత్రం కలిసి రావట్లేదు. మరి అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Ads
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్నేళ్ళ వరకు హీరోగా కొనసాగిన మంచు మోహన్ బాబు కలెక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు మొదటి వివాహం కలిసి రాలేదు. మోహన్ బాబు మొదట విద్యాదేవిని పెళ్లి చేసుకున్నారు. వారికి మంచు లక్ష్మి, విష్ణు సంతానం. వారి చిన్నతనంలోనే విద్యాదేవి హఠాత్తుగా కన్నుమూశారు.
ఆ పిల్లలను చూసుకోవడం కోసం విద్యాదేవి చెల్లెలు నిర్మల దేవిని మోహన్ బాబు రెండవ పెళ్లి చేసుకున్నారు. ఆయనలాగే ఆయన రెండవ కుమారుడు మనోజ్ కూడా ఫస్ట్ వివాహం కలిసి రాలేదు. మనోజ్ ప్రణతి రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే కొంతకాలనికే ఇద్దరు అభిప్రాయ భేదాలతో విడాకులు తీసుకున్నారు. తాజాగా మంచు మనోజ్ భూమా మౌనికను రెండవ పెళ్లి చేసుకున్నాడు.
ఇలాగే అక్కినేని కుటుంబంలోను జరిగింది. అక్కినేని నాగార్జున మొదట హీరో వెంకటేష్ సోదరి లక్ష్మీని పెళ్లి చేసుకున్నారు. వీరు నాగచైతన్య పుట్టిన అనంతరం విడాకులు తీసుకున్నారు. నాగార్జున హీరోయిన్ అమలను రెండవ వివాహం చేసుకున్నారు.
అక్కినేని కుటుంబంలో హీరో సుమంత్ హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలనికే ఈ జంట విడిపోయారు. ఆయన సోదరి సుప్రియ చరణ్ అనే అతనిని పెళ్లి చేసుకుంది. కానీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో అతనికి విడాకులు ఇచ్చింది.
ఇక యంగ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతను ప్రేమించి పెద్దలను ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లు కలిసి ఉన్న ఈ జంట హఠాత్తుగా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఇద్దరు ఎవరి కెరీర్ లో వారు ముందుకు వెళ్తున్నారు. ఇలా అక్కినేని కుటుంబానికి, మంచు కుటుంబానికి మొదటి వివాహం కలిసి రాలేదు.
Also Read: మంచు మనోజ్ పెళ్లి ఆ స్టార్ హీరోయిన్ లాగే చేసుకున్నాడా?