మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్‌ రెహమాన్‌ సతీమణి ఫోటో చూశారా?

Ads

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ అవార్డు గ్రహిత ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే పేరే ఒక బ్రాండ్‌. దాదాపు 30 సంవత్సరాల క్రితం మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి  పరిచయం అయ్యారు. అప్పటి నుండి ఆయన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. దేశంలోనే  టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు.

తెలుగు, తమిళం, హిందీ, ఆంగ్లంతో పాటు అనేక భాషలలో రెహమాన్ సంగీతం అందించారు. ఇక స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి అందించిన సంగీతానికి గాను ఆయన ఒకేసారి రెండు ఆస్కార్‌ అకాడమీ అవార్డులను అందుకున్నారు. ఇప్పటికి ఈ ఘనత ఎవరికి సాధ్యం కాలేదు. ఏఆర్‌ రెహమాన్‌ ఒక సినిమాకి సంగీతాన్ని అందిస్తే ఆ మూవీ మ్యూజికల్‌ హిట్‌ అని ఇప్పటికి ఆడియెన్స్ భావిస్తారు. గత ఏడాది ఆయన మ్యూజిక్ అందించిన వెందు తనిందది కాడు, పొన్నియిన్‌ సెల్వన్ సినిమాలు సెన్సేషనల్ విజయాన్ని సాధించాయి.
ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ పొన్నియిన్‌ సెల్వన్‌ 2, పత్తుతల, లాల్‌ సలాం, మామన్నన్, ఆడుజీవితం లాంటి సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాలలో కోలీవుడ్ స్టార్ శింబు హీరోగా నటించిన పత్తుతల సినిమా మార్చి 30న విడుదల కాబోతుంది. అలాగే పొన్నియిన్‌ సెల్వన్‌ 2 ఏప్రిల్‌ 28న విడుదల కాబోతుంది. వీటి తరువాత మామన్నన్‌ అనే మూవీ, ఇలా ఈ సంవత్సరం అంతా నెలకో సినిమా చొప్పున రెహమాన్‌ తన ఫ్యాన్స్ ని అలరించనున్నారు.
ఇక ఏఆర్‌ రెహమాన్‌ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన భార్య గురించి ఎక్కువ మందికి తెలియదు. 1995లో మార్చి 12న రెహమాన్‌, సైరా భానుల వివాహం జరిగింది. ఈ ఏడాదితో వీరి వివాహ జీవితం 28 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఏఆర్‌ రెహమాన్‌ వీరి పెళ్లిరోజు సందర్భంగా తన భార్యతో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేశారు. దీంతో వీరికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పలువురు తెలిపారు. వీరికి ఇద్దరు కూతుర్లు రహీమ రెహమాన్‌, ఖతీజా రెహమాన్, కుమారుడు ఒమీన్‌ ఉన్నారు.
Also Read: ప్రీ ఆస్కార్స్ పార్టీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ ధర ఎంతంటే?

Ads

 

View this post on Instagram

 

A post shared by ARR (@arrahman)

Previous articleరాజమౌళి సినిమాల్లో ”ప్రకాష్ రాజ్” ఎందుకు ఉండరు…? కారణం ఇదే..!
Next articleఒకప్పటి స్టార్ హీరోయిన్ మహేశ్వరి ఇప్పుడు ఎలా ఉందో? ఏం చేస్తుందో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.