ఆ సీనియర్ ప్లేయర్ ని కాదని మరీ “సూర్య” ని ఆడించాడు…సెమీఫైనల్ దెబ్బకి “రోహిత్” ప్లాన్ మార్చాల్సింది.?

Ads

2003 లో జరిగినట్టే వరల్డ్ కప్ లో మరోసారి ఇప్పుడు జరిగింది. ఆస్ట్రేలియాతో చేతిలో ఫైనల్ లో ఓడిపోయింది భారత్. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కి దిగిన భారత్…నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలవుట్ అయ్యింది. విరాట్ కోహ్లీ(63 బంతుల్లో 4 ఫోర్లతో 53), కేఎల్ రాహుల్(107 బంతుల్లో ఫోర్‌తో 66), రోహిత్ శర్మ(31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47)లు తప్ప మిగిలిన ప్లేయర్స్ అందరు చెప్పుకోదగ్గ స్కోర్ ఏం చేయలేదు.

ఇక 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు…47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా…6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 120 బాల్స్‌లో 137 రన్స్ చేసి ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. లబుషేన్ (58) హాఫ్ సెంచరీతో రాణించి హెడ్‌కు సహకారం అందించాడు. నాకౌట్ మ్యాచ్‌లంటే విజృభించే ఆస్ట్రేలియా జట్టుకి…టాస్ గెలవడం బాగా కలిసొచ్చింది. మొదటి ఇన్నింగ్స్ లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భారత్ ని తక్కువ స్కోర్ కె పరిమితమయ్యేలా చేసారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి డ్యూ రావడం ఆ జట్టుకు బాగా కలిసొచ్చింది.ఆ డ్యూ నే మన కొంపముంచింది.

Ads

ఇది ఇలా ఉంటె…”సూర్య కుమార్ యాదవ్” పై ఇండియా క్రికెట్ ఫాన్స్ మండిపడుతున్నారు. 36 వ ఓవర్ లో బ్యాటింగ్ కి వచ్చిన సూర్య టీ 20 స్టైల్ లో ఆడి మంచి స్కోర్ చేస్తాడు అనుకుంటే… జిడ్డు బ్యాటింగ్ ఆడటమే కాదు…స్ట్రైక్ తాను ఉంచుకోకుండా బౌలర్ అయిన షమీకి ఇస్తూ వచ్చాడు. చివరి 10 ఓవర్లలో బౌండరీలు స్కోర్ చేయాల్సింది పోయి డిఫెన్స్ ఆడాడు. 28 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేసాడు. కీలక సమయంలో పిచ్చి షాట్ ఆడి అవుట్ అయ్యాడు. అతని ప్లేస్ లో అశ్విన్ ని ఆడించి ఉంటె ఇంకొన్ని పరుగులు చేసేవాడు. ముఖ్యంగా ఆరో బౌలర్ గా ఉండేవాడు. బ్యాటింగ్ లైనప్ కావాలని అశ్విన్ ని పక్కన పెట్టి మరీ సూర్యని ఆడించారు. చివరికి అతను ఫెయిల్ అయ్యాడు.

Previous articleఅదే మన కొంపముంచిందా.? ఇండియా ఓటమికి ఇదే ప్రధాన కారణమా.?
Next articleWORLD CUP2023: ఫైనల్ లో ఇండియా ఓడిపోవడానికి 4 ప్రధాన కారణాలు ఇవే…అదే ఆస్ట్రేలియాకి ప్లస్ అయ్యింది.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.