Ads
జనవరి 22న అయోధ్య రామ మందిరంలో ప్రధాని మోదీ సమక్షంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించ బోతున్న విషయం తెలిసిందే. ఈ అపూర్వమైన ఘట్టం కోసం భారతీయులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
తాజాగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అయోధ్యలో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కోసం శ్రీ రాముని విగ్రహన్ని ఎంపిక చేసినట్లు సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియచేసారు. కర్ణాటకకు చెందిన శిల్పి చెక్కిన శ్రీరాముడి విగ్రహాన్ని రామా మందిరంలో ప్రతిష్ఠిస్తున్నట్లు తెలిపారు. దాంతో ఆ శిల్పి ఎవరా అని నెటిజెన్లు ఆరా తీస్తున్నారు. ఆ శిల్పి ఎవరో ఇప్పుడు చూద్దాం..
శ్రీరాముడి విగ్రహాన్ని అయోధ్య శ్రీరామ మందిరంలో గర్భగుడిలో జనవరి 22న ప్రతిష్టించడానికి సెలెక్ట్ చేశారని, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన విగ్రహాన్ని ఓటింగ్ ద్వారా ఏకగ్రీవంగా ఎంపిక చేసారు.
ప్రస్తుతం భారత్ లో అత్యంత డిమాండ్ కలిగిన శిల్పులలో మైసూర్ కు చెందిన అరుణ్ యోగిరాజ్ ఒకరు. అతను శిల్ప ప్రపంచంలో పెరిగి, పెద్దయ్యాడు. ఎందుకంటే అరుణ్ తండ్రి యోగిరాజ్, తాత బసవన్నలు కూడా ప్రఖ్యాత శిల్పులు. ఎంబీఏ చదివి కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేస్తున్న అరుణ్, శిల్పకళ పై ఉన్న ఆసక్తితో జాబ్ వదిలి, 2008 లో శిల్పిగా మారారు. అప్పటి నుండి, కళానైపుణ్యం వృద్ధి చేసుకుంటూ ఎన్నో ఐకానిక్ శిల్పాలను చెక్కి, దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు.
Ads
అరుణ్ ఇండియా గేట్ దగ్గర అమర్ జవాన్ జ్యోతి వెనుక భాగంలో కనిపించే సుభాష్ చంద్రబోస్ ముప్పై అడుగుల విగ్రహంతో పాటు ఆకట్టుకునే అనేక శిల్పాలు రూపొందించారు. కేదార్ నాథ్ లోని పన్నెండు అడుగుల ఆది శంకరాచార్యూని శిల్పం నుండి మైసూరులోని 21 అడుగుల అంజనేయుని విగ్రహం వరకు శిల్పాలను చెక్కి, దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. కోట్లాది మంది భక్తులు పూజించబోయే అయోధ్య రాముడిని కూడా అరుణ్ చెక్కి, వార్తల్లో నిలిచారు.
Also Read: శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ నియమం తప్పకుండా పాటించాలా..? సోమసూత్రం అంటే ఏంటో తెలుసా..?