Ads
నందమూరి బాలకృష్ణ సరైన సినిమా పడితే రికార్డులు కొల్లగొట్టడం ఖాయం. ఆయన పేరు మీద ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. అయితే బాలయ్య-బి.గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన నరసింహనాయుడు చిత్రం సెన్సేషనల్ హిట్ అయింది.
చిన్ని కృష్ణ అందించిన ఈ కథలో బాలకృష్ణ నరసింహనాయుడుగా ఒదిగిపోయారు. రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని బాలయ్య తన డైలాగులతో పలికించిన తీరు అమోఘం. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
Ads
అయితే ఈ సినిమా కామవరపుకోట అనే చిన్న గ్రామంలో వందరోజులాడి సెన్సేషన్ సృష్టించింది. ఆ గ్రామంలో 30రోజుల పాటు హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. కేవలం అప్పుడు పది రూపాయల టికెట్ తో ఈ సినిమా 100 రోజులాడి 11 లక్షలు కలెక్షన్స్ సాధించింది. ఇప్పటివరకు కామవరపుకోటలో మళ్లీ వంద రోజులు ఆడిన సినిమా లేదు. గతంలో బాలయ్య సృష్టించిన రికార్డు తెలుసుకుని ఆయన అభిమానులు ఇప్పుడు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం బాలయ్య బాబి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.