Ads
ఇప్పుడు అంటే వెబ్ సిరీస్ లు ఎక్కువగా అయిపోయాయి. కానీ గతంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు షార్ట్ ఫిలిమ్స్ హవా నడిచింది. చాలా మంది షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్లలో ఇప్పుడు చాలా పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు. అలా దాదాపు పది సంవత్సరాల క్రితం విడుదలైన ఒక షార్ట్ ఫిలిం సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు అలాంటి షార్ట్ ఫిలిం మళ్లీ రాలేదు. ఆ షార్ట్ ఫిలిం పేరు మధురం.
రవితేజ దుగ్గిరాల, చాందిని చౌదరి ఈ షార్ట్ ఫిలింలో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఫణీంద్ర నార్శెట్టి ఈ షార్ట్ ఫిలింకి దర్శకత్వం వహించారు. ఈ షార్ట్ ఫిలిం ఎంతో మంది ప్రశంసలు అందుకుంది. ఎంతో మంది ప్రముఖులు ఈ షార్ట్ ఫిలింని పొగిడారు. ఇందులో నటించిన వాళ్లందరికీ కూడా చాలా మంచి పేరు వచ్చింది. చాందిని చౌదరి ఈ షార్ట్ ఫిలిం ద్వారా ఇంకా ఫేమస్ అయిపోయారు. ఇందులో ఉన్న డైలాగ్స్ అయితే షార్ట్ ఫిలిం మొత్తానికి హైలైట్ అయ్యాయి. ఈ షార్ట్ ఫిలిం దర్శకుడు ఫణీంద్ర నార్శెట్టి ఆ తర్వాత మను సినిమాకి కూడా దర్శకత్వం వహించారు.
Ads
బ్రహ్మానందం కొడుకు గౌతమ్ హీరోగా నటించిన ఈ సినిమాలో, చాందిని చౌదరి హీరోయిన్ గా నటించారు. ఇప్పుడు 8 వసంతాలు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ దుగ్గిరాల హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మధురం షార్ట్ ఫిలిం తెలుగులో షార్ట్ ఫిలిమ్స్ రావడానికి ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచింది. ఎంతో మంది యంగ్ ఫిలిం మేకర్స్ కొత్త కథలు రాయడం మొదలుపెట్టారు. ఎంతో మంది ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ వైపు వెళ్లడం మొదలుపెట్టారు. ఇదే తరహాలో ఆ తర్వాత ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ వచ్చాయి. కానీ మధురం షార్ట్ ఫిలిం మాత్రం అందరికీ గుర్తుండిపోతుంది.
watch video :