Ads
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ సీజన్ 7 లో పలువురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాళ్ళు ముదురు అనుకుంటే వచ్చేవాళ్ళు దేశముదురుగా ఉంటున్నారు. ఇలా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన బ్యూటీస్ లో ఒకరు అశ్విని శ్రీ. సినిమాల్లో కూడా హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
అక్టోబర్ 8న బిగ్ బాస్ 2.ఓ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా ఎంటర్ అయిన ఈ అశ్విని శ్రీ.. వచ్చి రావడంతోటే అందరి దృష్టిని ఆకర్షించింది. అమీర్ పేట అనే మూవీలో హీరోయిన్గా చేసిన అశ్విని అంటే మీకు తెలియకపోవచ్చు. కానీ సరిలేరు మీకు ఎవరు మూవీలో రష్మిక రెండవ అక్క అంటే వెంటనే గుర్తు పడతారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు మూవీలో మిలిటరీ ఆఫీసర్ అయిన మహేష్ బాబు విజయశాంతి కుటుంబాన్ని కలవడానికి ట్రైన్లో వెళ్లే క్రమంలో రష్మిక ఆమె కుటుంబం పరిచయం అవుతుంది.
Ads
సరదాగా సాగే ఆ ట్రైన్ సీక్వెన్స్ లో రష్మిక సెకండ్ సిస్టర్ గా నటించిన నటి ఎవరో కాదు ఈ అశ్విని శ్రీ . ఈ మూవీతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది అనడంలో డౌటే లేదు. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే ఈ భామ పెట్టే ఫోటోలు చూస్తే ఆమె ఎంత బోల్డో తెలుస్తుంది. ఆల్రెడీ బయట ఉండి హౌస్ లో వాళ్ళ ఆట అంతా ఒక గంట కనిపెట్టిన ఈ భామ లోపల వెళ్లి ఏ మేర సక్సెస్ అవుతుందో చూడాలి. సరిలేరు లోనే కాదు..రవితేజ నటించిన “రాజా ది గ్రేట్” సినిమాలో ఓ పాటలో కూడా అశ్విని కనిపిస్తారు. ఆ వీడియో ఒక లుక్ వేయండి.
watch video: