బిత్తిరి సత్తితో ఉన్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.? ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉంది.!

Ads

సినీ ఇండస్ట్రీలో గుర్తింపు అనేది ఊహించినంత సులభంగా ఎవరికి దక్కదు.. కొందరికి ఒకే ఒక సినిమాతో స్టార్డం వస్తే, టాలెంట్ ఉన్నప్పటికీ మరికొందరికి గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో కాలం పడుతుంది. అయితే ప్రస్తుతం బుల్లితెర మోస్ట్ పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ పుణ్యమా అని చాలామంది చిన్న చిన్న స్టార్స్ కి మంచి గుర్తింపు దక్కింది. పదిమందిలో తమను తాము నిరూపించుకోవాలి అనుకునే ఎందరో చిన్న చిన్న సెలబ్రిటీస్ కి బిగ్ బాస్ ఒక మంచి ఫ్లాట్ ఫామ్ గా మారింది.

బిగ్బాస్ సీజన్ 7 లో ఎంట్రీ ఇచ్చిన రతిక రోజ్…ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయింది. ఇంత అందమైన అమ్మాయి ఇన్ని రోజులు ఎక్కడ దాక్కుందబ్బా అంటూ నటిజెన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు మరి. 2016 ముందు కేవలం ఒక స్టాండర్డ్ కమెడియన్ గా రతిక తన కెరియర్ను స్టార్ట్ చేసింది. అయితే అప్పట్లో ఆమె పేరు ప్రియా…పటాస్ తో తన ప్రయాణం మొదలుపెట్టి ఏడాది వరకు కామెడీ షో లో జనాలను నవ్విస్తూ వచ్చింది.

bigg boss telugu 7 contestant rathika

ఆ తర్వాత ఆ షోలో కనిపించలేదు సరి కదా తర్వాత ఏమైందో కూడా ఎవరికి తెలియదు. తిరిగి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు మోడల్ గా వచ్చి ఫుల్ టైం బిజీ అయిపోయింది ఈ భామ. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఎన్నో చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా పోస్టులు పెడుతూ ఏకంగా 133 వేల మంది ఫాలోవర్స్ ను సంపాదించింది.

image credits: a screenshot tupaki ramudu movie (mango videos)

ఇక చివరిగా బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన నేను స్టూడెంట్ సార్ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా సోషల్ మీడియాలో ఓ సినిమాలోని సీన్ ట్రెండ్ అవుతుంది. ఆ సీన్ లో బిత్తిరి సత్తి ఆటోని ఒక అమ్మాయి నడుపుతూ ఉంటుంది. ఆ అమ్మాయి మరి ఎవరో కాదు…బిగ్ బాస్ రతిక…ఆ సినిమా పేరు “తుపాకీ రాముడు”. ఈ సినిమా చూసినప్పుడు రతికని గుర్తించలేదు అని కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Previous articleఇలాంటి కాన్సెప్ట్ మీద కూడా సినిమా తీస్తారా.? యువతకు సందేశం ఇచ్చే సినిమా అంట.?
Next articleఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్…ఇప్పుడు సైకాలజిస్ట్.! ఎవరో గుర్తుపట్టారా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.