Ads
తెలంగాణలో బలమైన పార్టీలు మూడు ఉన్నాయి కానీ ఎక్కువగా ఎన్నికల సమయంలో సీట్లు గెలుచుకునేవి మాత్రం రెండు పార్టీలే. ఎప్పటినుంచో మంచి పట్టు సాధించాలి అని ప్రయత్నిస్తున్న బిజెపికి తెలుగు రాష్ట్రాలలో హవా తక్కువే. అలాంటిది మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో.. కామారెడ్డి నియోజకవర్గం నుంచి.. పోటా పోటీగా ఉన్న రెండు పార్టీలను మట్టి కనిపించి విజయకేతనం ఎవరు వేశాడు బిజెపి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి.
ఇది మామూలు విషయం కాదు.. ఎందుకంటే వరుసగా తెలంగాణ ఇద్దరు సీఎంలను ఒకేసారి ఓడించి గెలిచిన ఘనత ఉన్న వ్యక్తి కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఇదే నియోజకవర్గం నుంచి.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పోటీ చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రి క్యాండిడేట్లు పోటీ చేయడంతో ఈ నియోజకవర్గంలో అందరి దృష్టి ఉంది. నియోజకవర్గంలో తన అభ్యర్థిగా బిజెపి.. ఎన్నో తర్జనభర్జనల తర్వాత..కాటిపల్లి వెంకటరమణారెడ్డిని నిలబెట్టింది.
మొదట్లో అందరూ బిజెపి ఓడిపోతుందని అనుకున్నారు.. అసలు కాటిపల్లిని లెక్కలోకే తీసుకోలేదు. ఎంతసేపు కేసీఆర్ ,రేవంత్ రెడ్డిలో ఎవరు గెలుస్తారు అన్న చర్చే జరిగింది తప్ప కాటిపల్లి గెలుస్తాడు అన్న ఊహ కూడా ఎవరికి రాలేదు. అయితే ఎవరూ ఊహించని విధంగా.. కాటిపల్లి తన తెలివితేటలు ఉపయోగించి.. ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి 100 కోట్లు అభివృద్ధి కోసం ఖర్చు పెడతాను అనడం బాగా అచ్చి వచ్చింది. పైగా అతను స్థానికుడు కావడం మరొక బలమైంది. ఇలా ఎవరు ఊహించని విధంగా అతను విజయఢంకా మోగించాడు.
ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు కాటిపల్లి మరొక విషయంలో హైలైట్ అవుతున్నాడు. బిజెపి అధ్యక్షుడు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీపై తన అభిమానాన్ని చాటుకుంటూ.. మోడీ పేరు వచ్చేలా తన కారు నెంబర్ ప్లేట్ ని సెలెక్ట్ చేసుకున్నారు ఎన్నికల్లో కాటిపల్లి విజయం తర్వాత.. అతని కారు నెంబర్ ప్లేట్ కూడా బాగా వైరల్ అయింది. 4749 కార్ నంబర్ను నెంబర్ ప్లేట్ పై హిందీలో మోదీ అని అర్థం వచ్చేలా డిజైన్ చేయించారు. అయితే దీనికి అతను ప్రత్యేకంగా ఎటువంటి ఖర్చు పెట్టలేదట.. నెంబర్ వచ్చిన తర్వాత అలా చేయడం జరిగింది అని చెప్పారు. ప్రస్తుతం మోడీ అభిమానుల్లో ఈ నెంబర్ ప్లేట్ కి డిమాండ్ బాగా పెరిగింది.