Brahmamudi Serial: కావ్య ని బ్లెయిమ్ చేస్తున్న అనామిక పేరెంట్స్.. పండగ చేసుకుంటున్న రుద్రాణి, రాహుల్!

Ads

Brahmamudi Serial: స్టార్ మా లో మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది బ్రహ్మముడి సీరియల్. ఉమ్మడి కుటుంబంలో ఉండే కష్టసుఖాలు బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సీరియల్ కంటెంట్ అందరినీ ఆకట్టుకుంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో కావ్య దగ్గరికి వచ్చి థాంక్స్ చెప్తాడు కళ్యాణ్. ఎందుకు అని అడుగుతుంది కావ్య. ఆ మొక్కని నాటి నా ప్రేమని బ్రతికించారు అంటూ తను చూసిందంతా చెప్తాడు కళ్యాణ్. ఈ విషయంలో నేను మంచి చేశాను అనే అనుకుంటున్నాను, నేను సాంప్రదాయాన్ని నమ్ముతాను కానీ ఈ మూఢనమ్మకాలని నమ్మను.

జాతకాలు చూసుకొని పెళ్లి చేసుకునే వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారా? మిగిలిన వాళ్ళు అన్యోన్యంగా లేరా అందుకే ఇలా చేశాను అంటుంది కావ్య. మరొకసారి థాంక్స్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్. కావ్య కూడా కిచెన్ నుంచి బయటికి వచ్చేసరికి ఎదురుగా ఉన్న రాజ్ ని చూసి షాక్ అవుతుంది. ఇప్పుడేం గొడవ చేస్తారు అనుకుంటుంది.

కానీ రాజ్ బెడ్రూంలోకి వెళ్తాడు కావ్య కూడా బెడ్ రూమ్ లోకి వెళ్ళిన తరువాత మీరు అందర్నీ పిలిచి గొడవ చేస్తారు అనుకున్నాను అంటుంది. నేను మరీ అంత గొడవ చేసే వాడిలాగా కనిపిస్తున్నానా? నువ్వు ఇప్పుడు తప్పు చేయలేదు నా తమ్ముడు ప్రేమని గెలిపించావు అంటాడు. ఇదే మా అక్క విషయంలో చేస్తే తప్పు పట్టారు అంటుంది కావ్య. వీడు తన ప్రేమలో నిజాయితీగా ఉన్నాడు కానీ మీ అక్క నిజాయితీగా లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత కృష్ణుడి దగ్గరికి వెళ్లి నేను తప్పు చేశానని పగ పట్టి నా కాపురంలో ఇలాంటి నిప్పులు పోయొద్దు అని దండం పెట్టుకుంటుంది.

Ads

మరోవైపు కనకం నిద్రపోవటం కోసం ఆమెకి తెలియకుండా మందు తాగిస్తుంది రుద్రాణి. అయితే తాగిన మైకంలో రుద్రాణి కి చుక్కలు చూపిస్తుంది కనకం. తర్వాత రాజ్ కి శ్వేత ఫోన్ చేస్తుంది ఎక్కడ ఆ ఫోన్ కావ్య వింటుందో అని సీక్రెట్ గా మాట్లాడుతాడు నేనేమైనా మీ కంపెనీ సీక్రెట్స్ ఎవరికైనా చెప్తానా అంత సీక్రెట్ గా మాట్లాడుతున్నారు అంటుంది కావ్య.

సీక్రెట్ సీక్రెట్ గా ఉండటమే మంచిది లేదంటే అది న్యూ సెన్స్ అవుతుంది అంటాడు రాజ్. ఆ తర్వాత అనామిక ఆమె తల్లిదండ్రులు మొదటి పెళ్లి కార్డు తీసుకొని ఇక్కడికి వస్తున్నారని కళ్యాణ్ ద్వారా తెలుసుకుంటుంది కనకం. దాన్ని ఎలా చెడగొట్టాలా అని ప్లాన్ వేస్తుంది.

ఇక రేపటి ప్రోమోలో

సీతారామయ్య ఇంటికి వచ్చి అనామిక, ఆమె పేరెంట్స్ మొదటి పెళ్లి కార్డు ఇస్తారు. అది చూసిన అప్పు మొహం బాధగా పెట్టుకుంటుంది. పెళ్లి కార్డు తీసుకున్న తర్వాత గంధం రాసి బొట్టు పెట్టి దేవుడి దగ్గర పెట్టి హారతి ఇవ్వు అని కావ్యకి చెప్తుంది చిట్టి.

కావ్య పసుపు రాసి బొట్టు పెట్టి హారతి ఇస్తుంటే ఆ పెళ్లి కార్డు కి నిప్పు అంటుకుంటుంది. అంతకుముందే రుద్రాణి వాళ్ళు కుంకుమలో ఏదో కలపటం వాళ్ళు అనుకున్న ప్లాన్ సక్సెస్ అవటంతో సంతోషపడతారు రుద్రాణి, రాహుల్. పెళ్లి కార్డు నిప్పు అంటుకోవడం చూసిన కుటుంబ సభ్యులందరూ షాకవుతారు.

ఈ పెళ్లి జరగడం అసలు మీ వదినకి ఇష్టమేనా అంటూ కావ్య ని బ్లేమ్ చేస్తూ మాట్లాడతారు అనామిక పేరెంట్స్. ఆ మాటలకి కావ్య తో పాటు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇదంతా రుద్రాణి పని అని ఇంట్లో వాళ్ళందరూ గ్రహిస్తారా లేక నేరం కావ్య మీద మోపుతారా, పెళ్లి ఆపటానికి కనకం వేసిన ప్లాన్ ఏమిటి ఇవన్నీ తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

Previous articleఎవరీ “ప్రణితి షిండే”…రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారమప్పుడు కనిపించిన ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటంటే.?
Next articleకర్ణాటకలో లాగే తెలంగాణ ఆటో డ్రైవర్ల పరిస్థితి మారుతుందా..? ఓ ఆటో డ్రైవర్ ఎదురుకున్న పరిస్థితి ఇది.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.