Ads
జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్, పలు షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బుల్లితెర పై తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి, అలరించారు.
సాఫ్ట్‌వేర్ సుధీర్ మూవీతో హీరోగా మారాడు. వరుస చిత్రాలలో హీరోగా చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ‘కాలింగ్ సహస్ర’ అనే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ మూవీ ఎలా ఉందో? స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
సుడిగాలి సుధీర్ నటించిన ఈ మూవీలో స్పందన పిల్లి హీరోయిన్ గా నటించింది. డాలీ షా, శివబాలాజీ కీలక పాత్రలలో నటించన ఈ చిత్రానికి అరుణ్ విక్కిరాలా దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీని వెంకటేశ్వర్లు కాటూరి, చిరంజీవి పామిడి, విజేష్ తాయల్ కలిసి నిర్మించారు.
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, బెంగళూరు నుండి హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ అజయ్ శ్రీవాత్సవ్ (సుడిగాలి సుధీర్). అతని ఆఫీస్ బాస్ న్యూ సిమ్ తీసుకోమనడంతో కొత్త సిమ్ తీసుకుని తన మొబైల్ లో వేస్తాడు. కొత్త సిటీ, కొత్త జీవితం అనే ఫీల్ లో ఉన్న అజయ్ కి వరుసగా ఫోనులు చేస్తూ సహస్ర అంటూ ఆరా తీస్తూంటారు. సహస్ర ఎవరో తెలియదని, కొత్త సిమ్ తీసుకున్నట్టు చెప్పినా కాల్స్ చేసే వారు వినిపించుకోరు.
కాల్స్ వస్తూనే ఉంటాయి. దాంతో సహస్ర ఎవరో తెలుసుకోవడానికి అజయ్ వెళ్ళగా, అనుకోకుండా ఒక హత్యకేసులో ఇరుక్కుంటాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అజయ్ తీసుకున్న నంబర్ యాక్టివేటే కాలేదని తెలుస్తుంది. మరీ నంబర్ యాక్టివేట్ కాకుండా కాల్స్ ఎలా వస్తున్నాయి? అజయ్ చేతిలో చనిపోయిన వ్యక్తి ఎవరు? సహస్ర ఎవరు? ఈ స్టోరీలో లూసిఫర్ గ్యాంగ్ పాత్ర ఏంటి? శివ (శివ బాలాజీ) ఎవరు? చివరికి ఏమైంది అనేది మిగిలిన కథ.
కమెడియన్‌గా మాత్రమే సుడిగాలి సుధీర్‌ను చూసిన వాళ్లకు ఈ మూవీ కాస్త కొత్తగా అనిపిస్తుంది. అజయ్ శ్రీవాత్సవగా సుధీర్ బాగా నటించాడు. హీరోయిన్స్ డాలి షా, స్పందన ఒకే, సుధీర్ తమ్ముడిగా రవితేజ నన్నిమాల నటనతో ఆకట్టుకున్నాడు. శివబాలాజీకి చాలా రోజుల తర్వాత చేసిన పెద్ద పాత్రగా చెప్పవచ్చు.
Ads
Also Read: ఈ సినిమా గురించి 2 సంవత్సరాల నుండి మాట్లాడుకుంటూనే ఉన్నారు..? అసలు ఏం ఉంది ఇందులో..?