Ads
సినిమాల్లో నటించాలి అంటే కొన్ని విషయాలు తప్పక నేర్చుకోవాలి. యాక్టింగ్, కెమెరా ఫేస్ చేయాల్సిన విధానం, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. ముందు తెలియకపోయినా కూడా, మెల్ల మెల్లగా వారు రాణించాలి అంటే మాత్రం ఇవన్నీ తెలిసి ఉండాలి. అయితే సినిమాల్లోకి వచ్చాక కొన్ని వదిలేయాలి కూడా. అందులో మొహమాటం ఒకటి. సాధారణంగా చాలా సినిమాల్లో మామూలుగా చేయలేని ఎన్నో విషయాలు చేస్తారు. డాన్స్ లాంటివి బయట చేయడానికి చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ కెమెరా ముందు మాత్రం కచ్చితంగా డాన్స్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మొహమాటపడతారు.
కానీ సినిమాల్లో ఎదగాలి అంటే మాత్రం ఎలాంటి సీన్ అయినా, ఎలాంటి డాన్స్ అయినా కూడా చేయగలిగే అంత ధైర్యం పెంచుకోవాలి. అయితే, సినిమా నటులు ఒక స్టేజ్ కి వచ్చాక వారికి కొన్ని రిజర్వేషన్స్ వచ్చేస్తాయి. అంటే, కొన్ని రకమైన పాత్రలు మాత్రమే చేయగలుగుతారు. అందులో కూడా కొన్ని రకమైన సీన్స్ మాత్రమే చేయగలుగుతారు. ఇది ముఖ్యంగా హీరోలకి జరుగుతుంది. వారు పాత్రని ఎంచుకునే ముందు అలాంటి పాత్ర చేస్తే తమ అభిమానులు అంగీకరిస్తారా అనే విషయాన్ని కూడా ఆలోచించుకుంటారు.
వారికి కొన్ని పాత్రలు చేయాలి అని ఉన్నా కూడా అలాంటి పాత్రలు చేస్తే అది తమ అభిమానులను ఇబ్బంది పెడుతుంది ఏమో అని ఆలోచించి ఆగిపోయిన వారు కూడా ఉంటారు. కొంత మంది హీరోలు మాత్రం ఆ ధైర్యం చేసి, తాము కేవలం హీరోలం మాత్రమే కాదు. నటులం కూడా అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. యంగ్ హీరోలు ఇలా చేస్తే బానే ఉంటుంది. ఒక స్టేజ్ కి వచ్చాక, స్టార్ హీరో అయ్యాక కూడా కొంత మంది హీరోలు అలా చేస్తున్నారు. అందులో ఇటీవల ఇద్దరు హీరోలు తమ కొత్త సినిమాల్లో కొన్ని సీన్స్ చేశారు.
Ads
ఈ స్టేజ్ కి వచ్చాక మొహమాటం లేకుండా అలాంటి సీన్స్ చేయాలి అంటే చాలా ధైర్యం కావాలి. అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది అల్లు అర్జున్ గురించి. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఒక యాంటీ హీరో పాత్ర అని చెప్పవచ్చు. ఒక హీరో అంటే కొన్ని మంచి లక్షణాలు ఉండాలి. ఈ సినిమాలో హీరోకి అవి చాలా తక్కువగా ఉంటాయి. అయితే సినిమా క్లైమాక్స్ లో హీరో, తాను ఎలా వెళ్లినా సరే తనని అందరూ ఒకేలాగా గౌరవిస్తారు అంటూ పెళ్లి బట్టలు లేకుండానే మంటపానికి వెళ్తాడు.
అంత పెద్ద హీరో అయ్యాక అలాంటి ఒక సీన్ చేయాలి అంటే కాస్త మొహమాటం, భయం కచ్చితంగా వస్తాయి. కానీ అల్లు అర్జున్ అవి ఏమీ ఆలోచించలేదు. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ లో అల్లు అర్జున్ చెప్పే డైలాగ్స్, తర్వాత బైక్ మీద పెళ్లి మండపానికి వెళ్లే సీన్ ఇదంతా ఇంకొక ఎత్తు. అంత పెద్ద హీరో అయ్యాక ఇలా చేయాలి అంటే ధైర్యం ఉండాలి. ఇటీవల మహేష్ బాబు కూడా గుంటూరు కారం సినిమాలో అలాంటి సీన్ ఒకటి చేశారు.
మహేష్ బాబు ఈ సినిమాలో డాన్స్ లాంటివి కూడా వేశారు. అయితే శ్రీలీలతో కలిసి మిర్చి యార్డ్ లో పాటకి డాన్స్ వేస్తున్నప్పుడు మహేష్ బాబు లుంగీ శ్రీలీల చేతికి వచ్చేస్తుంది. మహేష్ బాబు కూడా సాధారణంగా ఇలాంటి సీన్లు చేయరు. చాలా సినిమాల్లో మహేష్ బాబు డ్రెస్సింగ్ కూడా ఫార్మల్ గానే ఉంటుంది. అలాంటిది ఈ సినిమాలో ఆ లుంగీ వేసుకుని డాన్స్ చేయడం, ఆ తర్వాత అలాంటి ఒక సీన్ చేయడం అనేది, అది కూడా ఇప్పుడు ఇలా చేయడం అనేది మామూలు విషయం కాదు.
ఇక్కడ వాళ్ళ దుస్తుల గురించి కాదు. హీరోలు తమ లిమిట్స్ తాము బ్రేక్ చేసుకుంటున్నారు. మొహమాటం పక్కనపెట్టి పాత్ర కోసం ఏదైనా చేసే అంత ధైర్యం చేస్తున్నారు. ఇటీవల కాలంలో, ఇంత గుర్తింపు వచ్చాక తెలుగులో స్టార్ హీరోలు ఇలా చేయడం వీళ్ళిద్దరి విషయంలోనే జరిగింది. మరి ఇంకెవరైనా ఇలా చేసే ధైర్యం చేస్తారా?