Ads
అందరి వ్యక్తిత్వం ఒకేలా ఉండదు. ఒక్కొక్కరి ప్రవర్తన ఒక్కోలా ఉంటుంది. అయితే ఎవరు ఎలా ఉన్నా సరే మనల్ని అర్థం చేసుకోవాలని, ఒక్కొక్కసారి ఎదుటి వాళ్లు మన మాట వినాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి ఎవరు కూడా ఇతరులు చెప్పేది వినాలి అని అనుకోరు. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఇతరులు చెప్పినట్టు అనుసరించరు.
కానీ నిజానికి చాణక్యుడు ఎదుటి వాళ్ళు మన మాటలు వినాలంటే ఎలాంటి టిప్స్ ని ఫాలో అవ్వాలి అనే దాని గురించి చెప్పారు. చాణక్య నీతి ద్వారా చాణక్యుడు జీవితంలో జరిగే చాలా విషయాల గురించి అమూల్యమైన విషయాలను పంచుకున్నారు. అదే విధంగా ఇతరుల్ని మన దారిలోకి ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి కూడా చెప్పడం జరిగింది. అయితే మరి ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
Ads
కొందరు మూర్ఖులు ఉంటారు. అటువంటి వాళ్ళని పొగుడుతూ ఉండాలి. ఇలా పొగుడుతూ ఉంటే కచ్చితంగా వాళ్లని మన కంట్రోల్ లో పెట్టుకోవచ్చు.అదే ఒకవేళ కోపిష్టి స్వభావం ఉంటే వాళ్ళతో మర్యాదగా ఉండాలి. ఎంతో ప్రశాంతంగా వాళ్లతో మాట్లాడాలి. ఒకవేళ కనుక మీరు వాళ్ళతో కోపంగా ఉంటే అప్పుడు మీ బంధం ముక్కలవుతుంది. కాబట్టి వాళ్ళతో మర్యాదగా వ్యవహరించాలి. స్నేహభావంతో వాళ్లతో ఉండాలి. అదే ఒకవేళ వాళ్లకు ఎక్కువ అహంకారం ఉంటే వారి యొక్క అభిప్రాయాన్ని గౌరవించాలి. దీంతో వాళ్లు మీ మాట వింటారు.
అత్యాశ, స్వార్థం కలిగి ఉంటే లాభం వస్తుందని మీరు చెప్తే చాలు. తప్పకుండా మీ మాటకి వాళ్ళు అంగీకరిస్తారు. ఎక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళు అయితే మీరు వారితో నిజాయితీగా వ్యవహరిస్తే సరిపోతుంది. దీంతో వాళ్లు మీ రూట్ కి వచ్చేస్తారు. కనుక మీరు ఎప్పుడైనా ఎవరినైనా కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే ఈ విధంగా అనుసరించి చూడండి.