Ads
ఒక మనిషి జీవితంలో పాటలు ఒక భాగం అయిపోయాయి. ఆ పాటలు పాడే సింగర్స్ కి కూడా చాలా మంచి ఆదరణ ఉంటుంది. వాళ్ల వల్లే పాటలకు అందం వచ్చిన పాటలు చాలా ఉన్నాయి. పాడడం అనేది చాలా కష్టం అయిన పని. ఆ నటులకి తగ్గట్టు గొంతు మార్చడం, యాస మార్చడం, ఒకవేళ పాట వేరే భాషల్లో పాడాల్సివస్తే ఆ భాష నేర్చుకోవడం ఇదంతా చాలా కష్టం. అయినా కూడా సింగర్స్ ఈ పనులన్నిటిని చాలా సులభంగా చేస్తారు.
వాళ్లు పాడే విధానం ఎలా ఉంటుంది అంటే, వాళ్లకి తెలుగు తెలుసు ఏమో అనిపిస్తుంది. ఈ పైన ఫోటోలో ఉన్న సింగర్ తెలుగు సింగర్ కాకపోయినా కూడా తెలుగు వారికి చాలా దగ్గర అయిన సింగర్. ప్రపంచం అంతా ఇష్టపడే సింగర్. చిత్ర మలయాళీ అయినా కూడా తెలుగు సింగర్ అనే అంత దగ్గర అయ్యారు. చిత్ర పాటలు ఎన్నో సంవత్సరాల నుండి వింటూ వస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు మారినా ఆమె గొంతులో మాధుర్యం మాత్రం అలాగే ఉంటుంది. ఆర్కెస్ట్రాతో పాడినా, ఆర్కెస్ట్రా లేకుండా పాడినా కూడా ఆమె పాట చాలా బాగుంటుంది. అందుకే ఆమె పాటలకి ఎన్నో అవార్డులు వచ్చాయి.
Ads
అంత పెద్ద స్థాయికి ఎదిగినా కూడా అందరితో చాలా స్నేహంగా ఉంటారు. చిత్రని అందరూ చిత్రమ్మ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. సీనియర్ సింగర్స్ నుండి యంగ్ సింగర్స్ వరకు అందరూ చిత్రకి స్నేహితులు. అందరితో చాలా సరదాగా, స్నేహంగా ఉంటారు. తన వృత్తి పట్ల తనకి ఎంత అంకిత భావం ఉంది అనేది చిత్ర వివిధ భాషల్లో పాడిన పాటలు వింటే అర్థం అవుతుంది. ఏ భాష పాట విన్నా కూడా చిత్ర ఆ భాష వచ్చినట్టు పాడతారు. అందుకే, చిత్రకి అంత మంది అభిమానులు ఉన్నారు. అన్ని రకాల పాటలు చిత్ర పాడగలుగుతారు. భక్తి పాటలు, మెలోడీ పాటలు, ఫాస్ట్ బీట్ పాటలు, మాస్ పాటలు కూడా చిత్ర పాడుతారు. ఇప్పుడు చిత్ర కొన్ని సింగింగ్ షోస్ కి జడ్జ్ గా కూడా వ్యవహరిస్తున్నారు.