“యానిమల్” లాంటి సినిమాని “చిరంజీవి” ఎప్పుడో చేశారా..? ఆ మూవీ ఏంటంటే..?

Ads

యానిమల్, ప్రస్తుతం భారతీయ సినీ వర్గాలలో, నెట్టింట్లో ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే చర్చ జరుగుతోంది. ఈ మూవీ ఇంకా రిలీజ్ కానేలేదు. ప్రోమోలతోనే ఈ మూవీ సంచలనం సృష్టిస్తోంది.

ఇప్పటికే వచ్చిన టీజర్, తాజాగా రిలీజైన ట్రైలర్ తో ఈ మూవీ పై ఉన్న భారీ అంచనాలు కూడా మించేలా హాట్ టాపిక్ గా మారింది. ట్రైలర్లోని షాట్ల గురించి నెట్టింట్లో చర్చ జరుగుతోంది. వీటిపై చాలా మీమ్స్ వచ్చాయి. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సినిమా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
‘అర్జున్ రెడ్డి’ తో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగ, యానిమల్ తో అంతకు మించిన సంచలనం క్రియేట్ చేసేలా ఉన్నాడు. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ఆడియెన్స్ చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ లోని కొన్ని  షాట్స్ పై పలు మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా నెట్టింట్లో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆ సినిమా పేరు  కిరాతకుడు.
ఆ మూవీలో స్టోరీ, సీన్స్ తో ‘యానిమల్’ సినిమాను పోలుస్తున్నారు. 1986 లో రిలీజ్ అయిన కిరాతకుడు మూవీలో చిరంజీవి తండ్రిని బాగా ఇష్టపడే కొడుకు క్యారెక్టర్ లో నటించాడు. ఇక బిజినెస్ పనుల్లో బిజీగా ఉండి, అస్సలు కొడుకును పట్టించుకోని తండ్రిగా జగ్గయ్య నటించారు. ఒక ట్రోఫీ గెలిచి తీసుకువస్తే, తండ్రి దానిని పట్టించుకోకపోతే కొడుకు మనసు గాయపడుతుంది.
తన తండ్రి ప్రేమ పొందలేక కోపంతో హీరో రగిలిపోయే సీన్స్ కూడా ఆ మూవీలో ఉంటాయి. దాంతో కొడుకు వయొలెంట్‌గా మారతాడు. ఇక దాదాపు యానిమల్ స్టోరీ కూడా అలానే కనిపిస్తోంది. యాదృచ్ఛికంగా జరిగిందో లేదో కానీ ఈ రెండు సినిమాలకు పోలికలు ఉండడంతో ‘యానిమల్’ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ‘కిరాతకుడు’ మూవీ ట్రెండ్ అవుతోంది. మెగాస్టార్ ఎప్పుడో ఇలాంటి పాత్ర చేసేడని ఫ్యాన్స్ ఆ మూవీ సీన్స్ ను నెట్టింట్లో షేర్ చేస్తున్నారు.

Ads

Also Read: సైలెంట్ గా రిలీజ్ అయిన స్టార్ హీరో సినిమా..! ఎలా ఉందంటే..?

 

Previous articleకార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారో తెలుసా..? కారణం ఏంటంటే..?
Next articleTS ELECTIONS: అన్ని పార్టీల దృష్టి ఆ ఏరియా పైనే…ఆ ఓట్లు ఎవరికో?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.