Ads
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి…అయితే కొన్ని చిత్రాల కారణంగా చిరు ఇబ్బందులకు గురి అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఒక చిత్రం లో వినూతమైన కోణం ప్రయోగించడంతో అది కాస్త వికటించి చిరంజీవి పరువు తీసింది. మరి ఆ మూవీ ఏంటి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి..
వివరాల్లోకి వెళితే…ఇవివి సత్యనారాయణ డైరెక్షన్లో చిరంజీవి హీరోగా వచ్చిన చిత్రం అల్లుడా మజాకా ఈ మూవీలో హీరోయిన్లుగా రమ్యకృష్ణ ,రంభ నటించారు. ఇంతకుముందు అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలో వాణిశ్రీ చిరంజీవి అత్తగా పోటీపడి మరీ నటించింది. కాబట్టి ఈ చిత్రంలో కూడా వాణిశ్రీ చేత అత్త పాత్ర చేయించాలి అని వివి సత్యనారాయణ భావించారు. ఇందుకుగాను వాణిశ్రీని కలిసి క్యారెక్టర్ గురించి కూడా. అయితే ఎందుకో వాణిశ్రీ మాత్రం ఈ పాత్ర చేయలేను అని సున్నితంగా తిరస్కరించడం జరిగింది.
తిరిగి టాలీవుడ్లోకి నటిగా రీఎంట్రీ ఇచ్చిన వాణిశ్రీ అత్త పాత్రలో చిరంజీవితో నటించిన చిత్రం అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’. ఇందులో చిరంజీవి వాణిశ్రీ ఇద్దరు ఢీ అంటే ఢీ అనేలా నటించారు.. మరి ఇంత మంచి ఛాన్స్ రెండవసారి వస్తే ఆ సదరు నటి ఎందుకు వద్దందో తెలుసా? కథ ప్రకారం ఈ సినిమాలో అత్త హీరోతో కలిసి స్టెప్పులు వేయాల్సి ఉంటుంది…పైగా ఒక రేప్ సీన్‌లో నటించాల్సి ఉంటుంది. ఇది నచ్చని వాణిశ్రీ ఈ సినిమా ఒప్పుకోలేదట.. దాంతో మరొక సీనియర్ నటి లక్ష్మి తో ఈ క్యారెక్టర్ చేయించారు.
Ads
ఇంత సినిమా రెడీ అయ్యాక వాణిశ్రీ అంచనాయే నిజమైంది. ఇందులో రంభ ,రమ్యకృష్ణ, లక్ష్మి కలిసి ఉండే.. ఒక సరదాగా సాగే..రే-ప్ సీన్ అప్పట్లో పెద్ద వివాదానికి కారణమైంది. పైగా మూవీలో లక్ష్మీ వేషధారణ పై కూడా ఎన్నో అభ్యంతరాలు వినిపించాయి. ఇందులో కొన్ని చోట్ల కామెడీ వల్గర్ గా ఉంది అన్న విమర్శలు కూడా వచ్చాయి. ఈ మూవీ షూటింగ్లో గుర్రం మీద నుంచి పడే చిరంజీవి గాయపడడంతో సంక్రాంతికి విడుదల కావాల్సిన మూవీ కాస్త మహాశివరాత్రి కి వచ్చింది.
మరోపక్క ఇటువంటి సీన్లు నటించినందుకు చిరంజీవిని కూడా విమర్శించిన వారు ఉన్నారు. మనదేశంలో అత్తను అమ్మతో సమానంగా చూసే సంప్రదాయం ఉన్నప్పుడు.. ఇలాంటి పాత్ర ఎందుకు చేశారు అని ఎద్దేవా చేసిన వారు ఉన్నారు. అంతేకాదు ఈ సినిమా రెండుసార్లు సెన్సార్ కి వెళ్లి వచ్చింది. అలా అప్పటివరకు చిరంజీవి సినిమాల్లో రెండు సార్లు సెన్సార్ కి వెళ్లి చెత్త రికార్డు క్రియేట్ చేసిన చిత్రంగా ఇది నిలిచిపోయింది.