చిరంజీవి కూతురు సుస్మిత భర్త బ్యాగ్రౌండ్ మీకు తెలుసా..?

Ads

మెగాస్టార్ చిరంజీవి గురించి మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు మెగాస్టార్ అందరికీ సుపరిచితమే. 150 సినిమాలకు పైగా నటించి ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నారు. పైగా ఈతరం హీరోలకి కూడా చిరంజీవి ఆదర్శమే. ప్రస్తుతం చిరు వరుస సినిమాలతో బిజీ గా వున్నారు. చిరంజీవి 1980లో అల్లు రామ లింగయ్య కుమార్తె అయిన సురేఖను వివాహం చేసుకున్నారు.

చిరంజీవి సురేఖ కి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు. చిరంజీవి కుమారుడైన రామ్ చరణ్ తేజ్ గురించి పరిచయం చేయక్కర్లేదు. ఇక వారి కుమార్తెల విషయానికి వస్తే..

Ads

వీళ్ళకి ఇద్దరు కుమార్తెలు. వాళ్ళే సుస్మిత, శ్రీజ. చిరు కూతురు సుస్మిత విష్ణు ప్రసాద్ ని వివాహం చేసుకున్నారు. విష్ణుప్రసాద్ చెన్నై లో స్థిర పడ్డారు. విష్ణు ప్రసాద్ ఫ్యామిలీ రాయలసీమలో ఉండేవారు. అయితే వీళ్ళు రాయలసీమ నుండి తమిళనాడు వెళ్లి అక్కడే ఉంటున్నారు. చెన్నైలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బిజినెస్ మ్యాన్ ఎల్ వి రామారావు సుస్మిత భర్త విష్ణు ప్రసాద్ తాత. ఎల్ వి రామారావు కొడుకు ఎల్ వి ప్రసాద్. ఎల్ వి ప్రసాద్, చంద్రికల కొడుకే సుస్మిత భర్త విష్ణు ప్రసాద్. విష్ణు ప్రసాద్ విదేశాలలో బిజినెస్ కి సంబంధించి మాస్టర్స్ ని పూర్తి చేసారు.

ఆ తర్వాత తన తాత గారి వ్యాపారాలను చూసుకోవడం మొదలుపెట్టారు. తన తాతయ్య పామ్ ఆయిల్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. ఆ వ్యాపారం తన తండ్రి కూడా చేశారు. ఇప్పుడు విష్ణు ప్రసాద్ కూడా ఆ వ్యాపారం ని చూసుకుంటున్నారు. ఆ వ్యాపారం ఇప్పుడు మరింత బాగా అభివృద్ధి చెందింది. సుస్మిత మరియు విష్ణు ప్రసాద్ కి ఇద్దరి కూతుర్లు. తన భర్త సహకారంతో ఈమె ఇప్పుడు సినిమాల్లోకి కూడా వచ్చింది, ఫ్యాషన్ టెక్నాలజీలో సుస్మిత చదువుకున్నారు. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా ఈమె పనిచేశారు కూడా.

Previous articleసినిమాల్లోనే కాదు.. బయట కూడా కపుల్స్ ఏ…!
Next articleIndrani Mukerjea Netflix: ఒకే ఒక్క సంఘటన… దేశం మొత్తాన్ని భయపెట్టింది..! అసలు ఎవరు ఈ మహిళ..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.