Ads
టీవీ ప్రోగ్రాం అంటే అంతకుముందు అదొక రకమైన విలువ ఉండేది. సినిమాల్లో ఇబ్బందికరమైన సన్నివేశాలు ఉంటాయి. కానీ టీవీ ప్రోగ్రాం అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా, కుటుంబం అంతా కూడా కలిసి చూడవచ్చు అని ఒక ధైర్యం ఉండేది. కానీ గత కొన్ని సంవత్సరాల నుండి ఈ ధైర్యం పోతోంది.
అందుకు కారణం టీవీ షోస్ లో వచ్చే డబల్ మీనింగ్ జోక్స్. కొన్ని వినడానికి, చూడడానికి ఇబ్బందికరంగా ఉంటాయి. జబర్దస్త్ వంటి ప్రోగ్రాంల ద్వారా ఇలాంటి జోక్స్ అనేవి చాలా సాధారణం అయిపోయాయి. దీనిపై ఒకపక్క కామెంట్స్ వస్తూనే ఉన్నా కూడా, మరొక పక్క ఇలాంటి షోస్ చూసేవారు కూడా ఎక్కువగా ఉండటంతో ఇలాంటి జోక్స్ ఇప్పటికి కూడా వేస్తూ ఉంటారు.
అయితే, కేవలం జబర్దస్త్ ప్రోగ్రాం వరకు మాత్రమే ఇది పరిమితం అవ్వలేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రోగ్రామ్స్ లో కూడా ఇలాంటివి అవుతూ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ లో యాంకర్స్ యంగ్ యాంకర్స్. వారి ముందు ఇలాంటి జోక్స్ వేసినా కూడా విని వినినట్టు వదిలేస్తారు. సుమలాంటి పెద్ద యాంకర్ ఉన్న షోలో కూడా ఇప్పుడు అలాంటి ఒక సంఘటన జరిగింది. సుమ అడ్డా ప్రోగ్రాం ప్రతి శనివారం వస్తుంది. ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమో ఇవాళ విడుదల చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా రియల్ లైఫ్ కపుల్స్ ఈ ప్రోగ్రాంలోకి వస్తున్నారు. వాళ్లకి ఒక టాస్క్ ఇచ్చారు.
Ads
అందులో భాగంగా వాళ్లకి ఒక తినే పదార్థం ఇచ్చి తినమన్నారు. దాని ప్రోమో కట్ చేసి విడుదల చేశారు. సుమ కూడా ఇబ్బంది పడుతూనే వాళ్ళని చూస్తున్నారు. అసలు ఒక షో లో ఇలా చేయాల్సిన అవసరం ఏం ఉంది? వాళ్లు రియల్ లైఫ్ కపుల్స్ అని వాళ్ళని చూస్తే మనకి అర్థం అవుతుంది కదా? ఇవన్నీ చేయించి వాళ్ళు కపుల్స్ అని, వాళ్ల మధ్య ప్రేమ ఉంది అని చూపించాల్సిన అవసరం ఏం లేదు కదా?
“ఒకే పదార్థాన్ని ఇద్దరూ చేతితో తాకకుండా తినడం, ఒకే కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాలు వేసుకొని తాగడం, ఇవన్నీ ఎందుకు? సినిమాల్లో ఇప్పటికే ఇలాంటి సన్నివేశాలు ఎక్కువగా ఉండి కుటుంబంతో కలిసి చూడడానికి చాలా మంది ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇలా టీవీ షోస్ లో కూడా ఉంటే ఇలాంటి షోస్ కూడా కుటుంబం అంతా కలిసి చూడటం కష్టమే అవుతుంది. అది కూడా పెద్ద యాంకర్లు ఉన్న షోస్ లో ఇలాంటివి చేయడం, అక్కడ ఉన్న యాంకర్లకి మాత్రమే కాకుండా చూసే ప్రేక్షకులకు కూడా ఇవన్నీ ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
watch video :
ALSO READ : యాత్ర-2 సినిమా కోసం… హీరో జీవా తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?