Ads
బాలీవుడ్ స్టార్ హీరోల పిల్లలు ఎక్కడ చదువుతారో మీకు తెలుసా, ఆ స్కూల్లో చదివే పిల్లలకి నెలకి స్కూల్ ఫీజు ఎంతో తెలుసా, ఆ స్కూల్లో పనిచేసే టీచర్స్ జీతాలు ఎంతో తెలుసా, తెలిస్తే షాక్ అవుతారు. అదే మన దేశంలోనే అత్యంత ప్రసిద్ధ పాఠశాలలో ఒకటైన ధీరుభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్.
ఇక్కడే చాలామంది ధనవంతుల పిల్లలు చదువుతూ ఉంటారు అలాగే బాలీవుడ్ సెలబ్రిటీస్ పిల్లలందరూ ఈ స్కూల్ స్టూడెంట్స్. ఇక్కడ ఒక సంవత్సరంలో సెలబ్రిటీ పిల్లలకు కట్టే స్కూల్ ఫీజు తో ఒక మిడిల్ క్లాస్ పిల్లల చదువులు మొత్తం పూర్తి చేయవచ్చు. ఈ స్కూల్ ఒక ప్రైవేట్ కో ఎడ్యుకేషనల్ డే స్కూల్.
మన దేశంలోనే అత్యంత ప్రసిద్ధి గల పాఠశాలల్లో ఒకటే దీని వ్యవస్థాపకురాలు ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ. భారతదేశపు ఉత్తమ అంతర్జాతీయ పాఠశాల అయిన ఈ స్కూల్లో చదివే పిల్లలకి నెలకి సుమారు లక్ష నుంచి లక్షన్నర వరకు ఫీజు ఉంటుంది. ఈ పాఠశాలలో దాదాపు 60 తరగతి గదులు అందులో డిజిటల్ క్లాక్ లు అడ్రస్ సిస్టం డిస్ప్లే మరియు రైటింగ్ బోర్డులు ఇలాంటి ఎన్నో ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ ఉంటాయి.
Ads
అలాగే డ్రాయింగ్ రూమ్, లర్నింగ్ రూమ్ వంటి మైండ్ రిఫ్రిషింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అందుకే మన బాలీవుడ్ స్టార్ హీరోల పిల్లలందరూ ఇక్కడ చదువుతారు. ఇటువంటి స్కూల్లో పనిచేసే టీచర్లకి శాలరీస్ ఎలా ఉంటాయో తెలిస్తే షాక్ అవుతారు. అలాగే ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేని టీచర్స్ కి జాబ్స్ ఉండవు కూడా. మినిమం ఐదేళ్లు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లకే ఈ స్కూల్లో జాబ్స్ లభిస్తాయి.
సాలరీస్ కూడా అదే రేంజ్ లో అందుకుంటారు టీచర్స్ ఎక్స్పీరియన్స్ ని బట్టి శాలరీని నిర్దేశిస్తారు. వీళ్ళకి రెండు లక్షల నుంచి 11 లక్షల వరకు శాలరీస్ ఉంటాయి వీళ్లు కేవలం చదువుని మాత్రమే బోధించడం కాకుండా ఇతర విషయాలను కూడా బోధించాల్సి ఉంటుంది. అందుకే ధనవంతులందరూ పిల్లల్ని జాయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే టాలెంట్ ఉన్న వాళ్ళందరూ ఈ స్కూల్లో జాబ్ చెయ్యటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.