లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి అర్జున్ దాస్ సినిమాలలో నటిస్తున్నాడా?

Ads

అర్జున్ దాస్ అనే పేరు ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా వినపడుతోంది. అయితే అతను టాలీవుడ్ యాక్టర్ మాత్రం కాదు. అతను ఇంతవరకు తెలుగులో ఒక్క సినిమాలో మాత్రమే నటించాడు. ఆ సినిమా ఏమిటి అంటే మ్యాచో మ్యాన్ గోపీచంద్ హీరోగా నటించిన ఆక్సిజన్.

అయితే గంభీరమైన గొంతు కలిగిన అర్జున్ దాస్ ఒక్క సంవత్సరంలోనే ఏడు చిత్రాల్లో నటించాడు. అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే పాపులర్ అయ్యాడు. అర్జున్ దాస్ కోలీవుడ్లో కార్తి హీరోగా నటించిన ‘ఖైదీ’సినిమాలో నటించాడు. అనంతరం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో హీరో విజయ్ నటించిన మాస్టర్ చిత్రంలో మంచి క్యారెక్టర్ లో నటించాడు. అతను చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే బాగా పాపులర్ అయ్యాడు. మరి అర్జున్ దాస్ అతి తక్కువ కాలంలోనే పేరు తెచ్చుకోవడం కోసం అతను పడిన శ్రమ గురించి, అతని గురించి ఇప్పుడు చూద్దాం..
అర్జున్ దాస్ 1990లో తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. ఆయన చిన్నప్పటి నుండి కూడా చదువులో ముందుండేవాడు. అయితే అతనికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అతని ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితుల వల్ల నటన పై కాకుండా, ముందుగా జీవితంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. అందువల్లనే ఆయన దుబాయిలో బ్యాంకు జాబ్ సంపాదించాడు. అర్జున్ జీతం లక్షల్లో ఉండేది. అలా సంపాదించడం ప్రారంభించాడు. కుటుంబపరమైన అన్ని పరిస్థితులను సెట్ చేసిన తరువాత తాను యాక్టర్ కావాలనే కలను తీర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ క్రమంలో ఉద్యోగం మానేసి, చెన్నైకి వచ్చాడు.
కానీ చెన్నైకి వచ్చిన తరువాత అర్జున్ దాస్ చాలా బరువు పెరిగాడు. సినిమాల్లో యాక్ట్ చేయాలంటే లావుగా ఉండకూడదని కష్టపడి ఏకంగా ముప్పై రెండు కిలోల బరువు తగ్గాడు. ఇక అర్జున్ నటించిన తొలి సినిమా పెరుమాన్. ఈ చిత్రంలో అతను లీడ్ రోల్ లో నటించినప్పటికి, ఆ సినిమా తరువాత అవకాశాలు రాలేదు. కొన్ని రోజులు ఖాళీగానే ఉన్నాడు. ఆ సమయంలో అనుకోకుండా ఒక షార్ట్ ఫిలింలో చేశాడు.

Ads

అయితే ఆ షార్ట్ ఫిలింలో అతని నటనకు మంచి పేరు వచ్చింది. దాని ద్వారానే కార్తీ ఖైదీ చిత్రంలో విలన్ గా నటించే ఛాన్స్ వచ్చింది. ముందు విలన్ గా చేయడానికి చాలా ఆలోచించి, ఆ తరువాత ఓకే చెప్పాడు. ఇక ఖైదీ మూవీ సూపర్ హిట్ అవడంతో అర్జున్ దాస్ కు వరుసగా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. ఇక అప్పటి నుండి అతను వెనక్కి చూడలేదు. అర్జున్ తెలుగు ఆడియెన్స్ కి తమిళ డబ్బింగ్ చిత్రాల ద్వారా సూపరిచితమే.

Also Read: తెలుగు ఇండస్ట్రీ లో విడాకులు తీసుకున్న సెలెబ్రెటీలు వీరే..!

Previous articleతెలుగులో కంటే ఇత‌ర భాష‌ల్లో స్టార్స్ అయిపోయిన… 10 మంది తెలుగు నటులు వీళ్ళే..!
Next articleవెంక‌టేశ్వ‌ర స్వామి హస్తాలలో రెండు కింద‌కు ఎందుకు చూపిస్తాయో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.