నేషనల్ అవార్డు విన్నర్… కానీ వరకట్నం కోసం వేధించాడా..? ఇతను ఎవరో తెలుసా..?

Ads

నేషనల్ అవార్డు గెలుచుకున్న ఒక సెలబ్రిటీ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఆయన ఒక ప్రముఖ దర్శకుడు ఆయన పేరు మన్సోర్. కర్ణాటక సినిమా ఇండస్ట్రీకి చెందిన మన్సోర్ భార్య అతనిపై ఆరోపణలు వేశారు. వరకట్నం కోసం తనని వేధించారు అని చెప్పారు.

మన్సోర్ భార్య అఖిల సుబ్రహ్మణ్యపురం పోలీస్ స్టేషన్ లో ఆయన మీద ఫిర్యాదు చేశారు. కోవిడ్ సమయంలో ఒక సినిమా తీయడానికి తన కుటుంబం దగ్గర పది లక్షలు తీసుకున్నారు. అంతే కాకుండా 30 లక్షల ఎస్ యు వీ కార్ కూడా ఇవ్వాలి అని అత్త వెంకట లక్ష్మమ్మ, వదిన హేమలత అఖిలని వేధింపులకు గురి చేస్తున్నారు అని చెప్పారు.

director mansore wife complaint

ఇప్పటికి కూడా అదనపు కట్నం కోసం తనని వేధిస్తున్నారు అని అఖిల అన్నారు. ఇవన్నీ మాత్రమే కాకుండా ,ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెప్తే తనని చంపేస్తామని బెదిరిస్తున్నారు అని అన్నారు. అయితే మన్సోర్ మాత్రం అఖిల చెప్పేవి నిజం కాదు అని అన్నారు. అఖిల మానసిక పరిస్థితి సరిగ్గా లేని కారణంగా ఇలా మాట్లాడుతున్నారు అని ఒక లెటర్ లో రాశారు. ఇందులో మన్సోర్ మాట్లాడుతూ, “నేను నా జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నాకు వ్యక్తిగత సమస్యలు కూడా ఉన్నాయి.”

director mansore wife complaint

Ads

“అందుకు నా భార్య అఖిల మానసిక ఆరోగ్యం కారణం. నేను నా భార్య మానసిక ఆరోగ్యం విషయంలో చాలా రోజులుగా ఎంతో ఇబ్బందులకి గురవుతున్నాను. బెంగళూరులో ఒక కౌన్సిలింగ్ సెంటర్ కి తీసుకెళ్ళాను. ఆమెలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆమెకి థెరపీ అవసరం అని వైద్యులు చెప్పారు. నేను నా పెళ్ళికి కానీ, ఆ తర్వాత కానీ,అఖిల వాళ్ళ కుటుంబం నుండి ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. వారి నుండి నాకు డబ్బులు, నగలు, కారు లాంటివి ఏమి రాలేదు. ఒకవేళ మీకు అంత అనుమానంగా ఉంటే నా బ్యాంక్ అకౌంట్ ని చెక్ చేసుకోవచ్చు.”

director mansore wife complaint

“అఖిల మాతో గొడవపడి ఇంటి నుండి వెళ్లిపోతూ తనతో పాటు ఇంట్లో ఉన్న నగలు, నా నేషనల్ అవార్డు, కూడా తీసుకెళ్లింది. మిగిలిన మెడల్స్ కూడా తీసుకెళ్లింది. నా భార్య చెప్పిన ఫిర్యాదుని పరిగణలోకి తీసుకోవద్దు. వరకట్నం కోసం చేసిన వేధింపులు, దళిత యువతిపై వేధింపులు లాంటి ఆరోపణలని మీరు పరిగణలోకి తీసుకోవద్దు” అంటూ రాశారు. మన్సోర్ అసలు పేరు మంజునాథ్. వీరికి 2021 లో వివాహం జరిగింది అయితే పెళ్లయిన కొద్ది రోజులకే వీరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి అని అంటున్నారు.

ALSO READ : ప్రభాస్ “సలార్” సినిమాలో చూపించిన “కాటేరమ్మ” దేవత కథ తెలుసా..?

Previous articleప్రభాస్ “సలార్” సినిమాలో చూపించిన “కాటేరమ్మ” దేవత కథ తెలుసా..?
Next article3 గంటలు థియేటర్ లో ఈ సినిమా ఎలా చూడగలిగారు? అంటూ…”యానిమల్” పై కామెంట్స్ చేసిన గృహలక్ష్మీ కస్తూరి..!