టాలీవుడ్‌ లో ఎక్కువ రెమ్యున‌రేషన్ తీసుకుంటున్న ద‌ర్శ‌కులు వీళ్ళే..!

Ads

తెర మీదకి సినిమా రావాలంటే డైరెక్టర్ ఎంతో కష్టపడాలి. డైరెక్టర్ పాత్ర చాలా ముఖ్యమైనది. ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి పెరిగిపోయింది. పాన్ ఇండియా మూవీస్ అయినటువంటి బాహుబలి, పుష్ప వంటి సినిమాలతో ఓ రేంజ్ లో మన తెలుగు ఇండస్ట్రీ దూసుకు పోతోంది. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. కలెక్షన్లు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. అయితే కలెక్షన్లు ఎక్కువ రావడంతో హీరోల రెమ్యునరేషన్ తో పాటుగా డైరెక్టర్ల రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది.

మరి టాలీవుడ్ డైరెక్టర్లు ఎంత తీసుకుంటున్నారు..?, ఏఏ డైరెక్టర్లు ఎలా తీసుకుంటున్నారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

రాజమౌళి:

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ సినిమాలని తీసుకు వచ్చారు.
పెద్ద బ‌డ్జెట్ సినిమాలని చేస్తారు. సినిమా బిజినెస్‌ను బ‌ట్టి రాజమౌళి రూ.100 కోట్లు తీసుకున్నా షాక్ అవ్వక్కర్లేదు.

త్రివిక్రమ్:

అగ్ర‌ద‌ర్శ‌కుల్లో ఒకరు త్రివిక్రమ్. త్రివిక్రమ్ ఒక్కో మూవీ కి రూ.20 కోట్ల‌ తో పాటు బిజినెస్‌లో వాటా ని కూడా తీసుకుంటారు త్రివిక్రమ్.

సుకుమార్:

Ads

ఇక సుకుమార్ విషయానికి వస్తే… రంగ‌స్థ‌లం సినిమా నుంచి ఈయన త‌న రేటును పెంచేశారు. ఒక్కో సినిమాకు 20 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నారు సుకుమార్. పుష్ప పార్ట్ 2 కి రూ.23 కోట్లు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

కొరటాల శివ:

ఆచార్య సినిమాకు 20 కోట్ల వ‌ర‌కు తీసుకున్నారు. దానికి ముందు ఈయన రూ.13 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకునేవారట.

పూరి జ‌గ‌న్నాథ్:

సొంత బ్యాన‌ర్‌లోనే ఎక్కువ‌ సినిమాలు తీస్తున్నాడు పూరి. ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వ‌ర‌కు ఈయన తీసుకుంటున్నాడు.

బోయ‌పాటి శ్రీ‌ను:

మొదట10 కోట్ల వ‌ర‌కు ఈయన తీసుకునేవాడు. అఖండ తో ఈయన మ‌ళ్లీ రెమ్యున‌రేష‌న్ ని పెంచేసాడు. 10 నుంచి రూ.12 కోట్ల వ‌ర‌కు తీసుకుంటున్నాడు.

అనీల్ రావిపూడి:

అనిల్ రావిపూడి ఎఫ్‌2 సినిమాతో రెమ్యునరేషన్ ని పెంచేసాడు. స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాకు రూ. 9 కోట్లు తీసుకోగా.. ఎఫ్‌3 కి రూ.10 కోట్లు తీసుకున్నాడు.

 

 

Previous articleఎం ఎస్ నారాయణ కొడుకు ఇంత అవమానాన్ని ఎదుర్కొన్నారా..? అవకాశం కోసం అడిగితే…!
Next articleరాఘవేంద్ర రావు దగ్గర శిష్య‌రికం చేసిన స్టార్ డైరెక్ట‌ర్లు వీరే..!