మహేష్ బాబు మూవీ తో శుభోదయం సుబ్బారావు గారు గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు ఎవరో మీకు తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన రెండవ చిత్రం భరత్ అనే నేను. మొదటిసారి యంగ్ ముఖ్యమంత్రిగా మహేష్ తన విశ్వరూపం చూపించాడు.కియారా అద్వానీ మంచి ఆదరణ అందుకుంది. అయితే ఈ చిత్రంలో శుభోదయం సుబ్బారావు అనే జర్నలిస్టు పాత్రలో కనిపించిన నటుడు ఎవరో మీకు తెలుసా?

సీఎంను ప్రశ్నించే జర్నలిస్టు పాత్రలో కనిపించిన ఈ శుభోదయం సుబ్బారావు క్యారెక్టర్ తర్వాత అతనికి అదే పేరు పై భారీ గుర్తింపు వచ్చింది. అంతకుముందు ఎన్నో సినిమాల్లో నటించిన రాని రికగ్నిషన్ ఈ ఒక్క క్యారెక్టర్ తో వచ్చింది. శుభోదయం సుబ్బారావు గారు కనిపించిన నటుడి పేరు రాజశేఖర్ అనింగి. ఇతను తెలుగు సినిమాలో పలు రకాల పాత్రలు పోషించాడు. 2014లో వచ్చిన షురుయాత్ కా ఇంటర్వెల్ అనే చిత్రంతో రాజశేఖర్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.

Shubhodayam Subbarao : మహేష్ బాబును ఎదురించిన ‘శుభోదయం సుబ్బారావు’ గురించి తెలుసా?

ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడేలే ,ప్రభాస్ బాహుబలి ది బిగినింగ్ ,స్పైడర్, భరత్ అనే నేను, అరవింద సమేత వీర రాఘవ లాంటి పలు చిత్రాలలో నటించాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఫ్యూచర్ ఫిలిమ్స్ ,టీవీ సీరియల్స్ ,షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో నటించాడు ఈ రాజశేఖర్. ఇండస్ట్రీ లోకి రాకముందు ఇతను ఐటీ ,బ్యాంకింగ్ మరియు ఆరోగ్య రంగంలో పనిచేశారట.

 

Previous article1986లో “రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350” ధర ఎంతో తెలుసా..? వైరల్ అవుతున్న అప్పటి బిల్.!
Next articleనోరుజారి ఇండస్ట్రీ లో అవకాశాలని కోల్పోయిన… 6 నటులు వీళ్ళే..!