49 ఏళ్ళ విజయ్ కి బాబాయిగా 41 ఏళ్ళ స్టార్ హీరోని ఎలా తీసుకుందాం అనుకున్నారు..? ఎవరంటే..?

Ads

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ దళపతి,లోకేశ్‌ కనగరాజ్‌ కాంబోలో వచ్చిన మూవీ లియో. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్‌ 19న రిలీజ్ అయిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది.

ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించగా, కీలక పాత్రలలో అర్జున్ సర్జా, సంజయ్‌ దత్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ నటించారు. అయితే హెరాల్డ్ దాస్‌ పాత్రకి అర్జున్ మొదటి ఛాయిస్ కాదట. మలయాళ స్టార్ హీరో ని తీసుకోవాలని భావించినట్టు లోకేష్ కనగరాజ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. మరి ఆ మలయాళ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన లియో కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా భారీ కలెక్షన్లను సాధించింది. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.600 కోట్ల వసూళ్లు సాధించి, విజయ్‌ దళపతి కెరీర్‌లో భారీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష నటించింది. బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌ దత్‌ హీరోకి తండ్రిగా నటించగా, బాబాయి మరియు గ్యాంగ్‌స్టర్ హెరాల్డ్ దాస్‌ గా అర్జున్ సర్జా నటించారు.
అయితే ఈ చిత్రంలో గ్యాంగ్‌స్టర్ హెరాల్డ్ దాస్ పాత్రకు దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ ముందుగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తీసుకోవాలని అనుకున్నారట. ఆ పాత్ర కోసం పృథ్వీరాజ్ ని సంప్రదించినట్లు లోకేష్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముంబై పోలీస్, అయ్యప్పనుమ్ కోషియుమ్, లూసిఫర్ వంటి సినిమాలలో పృథ్వీరాజ్ నటనకు ముగ్ధుడయ్యానని, విజయ్ కి విలన్‌గా నటింపచేయాలని అనుకున్నానని చెప్పాడు.
అయితే, పృథ్వీరాజ్ అప్పటికే ఉన్న కమిట్‌మెంట్‌లు మరియు డేట్లు సర్దుబాటు సమస్యల వల్ల లోకేష్  ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడట. దాంతో లోకేష్ పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ హెరాల్డ్ దాస్ క్యారెక్టర్ కు విలక్షణ నటుడు అర్జున్ సర్జాను ఎంపిక చేశారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Ads

Also Read: గూఢచారి 2 లో హీరోయిన్ ఈమెనే…చూడడానికి శోభిత ధూళిపాళ్లలానే ఉందిగా..! ఎవరంటే.?

Previous articleవీళ్లకి ఆదాయాలు మాత్రమే కాదు… అప్పులు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి..! అంబానీకి ఉన్న అప్పు ఎంతంటే..?
Next articleజోజు జార్జ్, కల్యాణి ప్రియదర్శిని ”అంథోని” ట్రైలర్
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.