Ads
వాష్ బేసిన్ లేదా సింక్ దాదాపు అందరి ఇళ్లలోనూ కనిపిస్తుంది. ఫేస్ లేదా చేతులు శుభ్రం చేయడం కోసం మనం వాష్ బేసిన్ ని ఉపయోగిస్తూ ఉంటాము. ప్రతిసారి బయటకు వెళ్లి అవసరం లేకుండా, టాప్ తిప్పినపుడు నీరు మన బట్టల పై పడి పాడైపోకుండా ఉండడం కోసం వాష్ బేసిన్ ని ఇంట్లోనే ఒక పక్కన కట్టించుకుంటారు.
Ads
కిచెన్ లో కూడా సింక్ ఉండడం ప్రస్తుత కాలంలో తప్పనిసరి అయ్యింది. ప్రతి ఇంట్లోనూ సింక్ ఉండడం సాధారణం అయిపోయింది. అయితే వాష్ బేసిన్ మధ్య భాగంలో ఉన్న రంధ్రాన్ని గమనించారా? దాని ఉపయోగం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుత కాలంలో ప్రతి గృహంలో వాష్ బేసిన్ ఉండడం అనేది కామన్. వీటిని సాధారణంగా స్టెయిన్లెస్ స్టీలు లేదా సిరామిక్ తో తయారు చేస్తారు. ఇళ్లల్లో కిచెన్, హాల్స్ బాత్రూమ్ లలో వాష్ బేసిన్ లేదా సింక్ ఉంటుంది. అయితే ఈ సింక్‌లను కొందరు హ్యాండ్ వాష్ కోసం ఉపయోగిస్తారు. కొందరు గిన్నెలు శుభ్రం చేయడానికి వాడుతారు. అయితే వాష్ బేసిన్, సింక్ ల మధ్య తేడా ఉంటుంది.వాష్ బేసిన్ మధ్య భాగంలో ఒక హోల్ ఉంటుంది. ట్యాప్ కి, సెంట్రల్ రంధ్రంకి మధ్యలో ఈ రంధ్రం ఉంటుంది. ప్రతి వాష్ బేసిన్ కి ఈ రంధ్రం కనిపిస్తుంది. కానీ కిచెన్ లో ఉపయోగించే సింక్‌లకు ఈ రంధ్రం ఉండదు. వాష్ బేసిన్లో చేతులు శుభ్రం చేసుకున్నప్పుడు వాటర్ ఎక్కువగా పేరుకుపోయినపుడు వాష్ బేసిన్ నిండి, వాటర్ బయటకు వస్తాయి.
అలా రాకుండా నిరోధించడం కోసం ఈ అదనపు రంధ్రంను ఏర్పాటు చేస్తారు. వాష్ బేసిన్ నిండేలా ఉన్నప్పుడు అందులోని వాటర్ ఈ రంధ్రం నుండి డ్రైనేజీలోకి వెళ్లిపోతాయి. ఈ రంధ్రం ద్వారా గాలి ప్రసరిస్తుంది. తద్వారా బేసిన్ లో అదనపు వాటర్ త్వరగా బయటకు పోయి, బేసిన్ నిండపోకుండా ఉంటుంది. లేదంటే బేసిన్ నిండి వాటర్ ఫ్లోర్ పైన పడుతుంది.
Also Read: వెస్ట్రన్ టాయిలెట్స్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఎందుకు ఉంటాయి.? ఏది ఎప్పుడు వాడాలి.?