మెగాస్టార్ పక్కన ఉన్న స్టార్ హీరో.. 500 రూపాయల నుండి 15 కోట్ల రెమ్యూనరేషన్ కు ఎదిగిన హీరో.! గుర్తు పట్టారా..?

Ads

సినిమా రంగం అనేది రంగుల ప్రపంచం అనే విషయం తెలిసిందే. ఈ రంగంలో ఎవరు ఎప్పుడు ఏ  స్థితికి చేరుకుంటారనే విషయాన్ని ఎవరి ఊహించలేరు. స్టార్‌ స్టేటస్ లో ఉన్నవారు ఒక్కసారిగా కిందపడిన వారు ఉన్నారు. చిన్న చిన్న పాత్రలు చేసేవారు ఓవర్‌‌నైట్‌లో స్టార్ స్టేటస్ అందుకుని సంచలనం సృష్టించినవారు ఉన్నారు.

Ads

అలా తెలుగు ఇండస్ట్రీలో 500 రూపాయల పారితోషికంతో కెరీర్ మొదలు పెట్టి, చిన్న చిన్న పాత్రలు, ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన నటుడు, ప్రస్తుతం రూ.15 కోట్ల పారితోషికం అందుకుంటూ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. అయితే ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
పైన ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి పక్కన ఉన్న వ్యక్తి ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరో. ఎలాంటి సినీ నేపథ్యం లేని ఫ్యామిలీ నుండి వచ్చి, సినీయం పై ఉన్న శక్తితో ఇండస్ట్రీలో అదుపెట్టి ఎన్నో కష్టాలు పడి,  100 కోట్ల హీరోగా ఎదిగారు. 500 రూపాయల రోజువారీ వేతనంతో కెరీర్ మొదలు పెట్టిన ఈ మాస్ హీరో, ఆ తర్వాత పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఆ తరువాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ గుర్తింపు పొందారు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు మాస్ మహారాజ రవితేజ.
రవితేజ చిన్న పాత్రలో ‘కర్తవ్యం’ మూవీలో మొదటిసారి తెరపై కనిపించారు. ఆ తరువాత కన్నడ మూవీ అభిమన్యు, చైతన్య, హిందీలో ఆజ్ కా గుండారాజ్ వంటి సినిమాలలో అంతగా గుర్తుపట్టని పాత్రలలో నటించారు. యాక్టర్ గా నిలదొక్కుకొవడానికి అల్లరి ప్రియుడు, నిన్నే పెళ్లాడుతా, సీతారామరాజు, మనసిచ్చి చూడు వంటి చిత్రాలలో హీరో ఫ్రెండ్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. 1999 లో శ్రీనువైట్ల తెరకెక్కించిన ‘నీ కోసం’ మూవీతో హీరోగా మారాడు. మొదటి చిత్రం హిట్ అవడంతో పాటు రవితేజకు నంది ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకున్నారు.
ఆ మూవీ తరువాత వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఖడ్గం, అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, వెంకీ వంటి చిత్రాలతో హీరోగా గుర్తింపు వచ్చింది. అయితే విక్రమార్కుడు మూవీతో స్టార్ స్టేటస్ ను అందుకున్నారు. ప్రస్తుతం రవితేజ ఒక్కో చిత్రానికి రూ. 15 కోట్ల పారితోషికం తీసుకొంటున్నారని తెలుస్తోంది. గత ఏడాది ధమాకా మూవీతో 100 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించారు. చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య కూడా 125 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది. రవితేజ ఈగిల్ మూవీతో ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Also Read: ‘యానిమల్’ యాక్టర్ బాబీ డియోల్ భార్య ఎవరో..? ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటో తెలుసా..?

Previous articleనేతాజీ పక్కన ఉన్న ఈ మహిళ ఎవరో తెలుసా..? డెవిల్ మూవీ కథ ఆమెదే..!
Next articleఐదుగురు పాండవులతో ద్రౌపది ఎలా కాపురం చేసేదో తెలుసా..? వాళ్ళు పెట్టుకున్న నియమం ఏంటంటే.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.