Ads
శరన్నవరాత్రి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గ్రామాల్లో, పట్టణాలలో దుర్గాపూజ మండపాలన్ని భక్తులతో కలకలలాడాయి. భక్తులంతా నిష్టతో పూజలు చేసి, అమ్మవారి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు
కొన్నిచోట్ల మనసును కదిలించే దృశ్యాలు కనిపించాయి. వాటిలో కొన్ని సామాజిక మధ్యమాలలో వైరల్ గా కూడా మారాయి. తాజాగా అమ్మవారి ఆశీర్వాదం కోసం పూజా మండపంలోకి వచ్చిన శునకాల వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బెంగళూరులోని ఒక ప్రాంతంలో నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా మండపంలోకి రెండు శునకాలు వచ్చి, ఆశీర్వాదం తీసుకుని, ఆ తరువాత ప్రసాదం కూడా స్వీకరించాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. గోల్డెన్ రిట్రీవర్ అనే జాతికి చెందిన రెండు పెంపుడు శునకాలు ఆస్కార్, కర్మ బ్లూ కలర్ దుస్తులు ధరింపచేసి, వాటి యజమాని పూజా మండపానికి తీసుకొచ్చారు. పూజారి ఆ శునకాలకు నుదిటి మీద బొట్టు పెట్టి, ప్రసాదం ఇవ్వడం ఆ వీడియోలో క్లియర్ గా కనిపిస్తోంది.
ఈ వీడియోను సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, శునకాలను మండపాల్లోకి అనుమతించాలా? లేదా? మీరు ఏం అనుకుంటున్నారు? అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోను 3 రోజుల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, ఇప్పటివరకు ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఐదు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. కాగా, సోషల్ మీడియాలో ఈ వీడియో పై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
కొందరు శునకాలను మండపంలోకి అనుమతించడం మంచి పరిణామంగా చూస్తే, కొందరు మాత్రం శునకాలను మండపంలోకి తీసుకురావడం పై విమర్శిస్తున్నారు. ‘శునకాలు కూడా ప్రేమకు అర్హమైనవి. అయితే చుట్టుపక్కల ఉండేవారు జంతువులను పెంచుకోవడం ఇష్టపడకపోవచ్చు. అందువల్ల బహిరంగ ప్రదేశాలలో జనాల సౌలభ్యం గురించి కూడా ఆలోచించాలి. మీ ఇంటి లోపల మీకు నచ్చినట్టుగా చేయండి’ అని ఒక నెటిజెన్ కామెంట్ చేశారు. ఇలా నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్లారు…కానీ అక్కడ చేదు అనుభవం.! ఏమైందంటే.?