Ads
జీవితంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి అని ఆశిస్తారు. అయితే జాతకరీత్యా కొందరికి కొన్ని గ్రహాల ప్రభావం ఎదుర్కోవాల్సి రావడంతో అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాంటి దోషాలను అతి ముఖ్యమైనది, అందరూ భయపడేది ఏలినాటి శని ప్రభావం.శని దేవుడు సొంత రాశిలో ప్రవేశించినప్పుడు.. కొన్ని రాశులపై ఏలినాటి శని ప్రభావం ఏర్పడుతుంది.
అయితే కొన్ని గ్రహాలతో శనికి పొంతన కుదిరితే మరికొన్ని గ్రహాలతో పొంతన ఉండదు. శని ..బుధ ,శుక్ర ,రాహు గ్రహాలతో ఎంతో స్నేహపూరితంగా ఉంటారు. మకర మరియు కుంభరాశి లకు శని అధిపతి.. ఆయన ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి కనీసం రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది. అంటే ఒక చక్రాన్ని పూర్తి చేయడానికి సుమారు 30 సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం శని ప్రభావం వల్ల మకర , కుంభ, ధనురాశిరాశి వారి పై ఏలినాటి శని ప్రభావం ఉంటుంది.
Ads
శని గ్రహం న్యాయం, ప్రేమ లాంటి తత్వాలకు ప్రతీక. అయితే శని ప్రభావం వల్ల ఎంతటి వారు అయినా కష్టాలు పడతారు కాబట్టి దీనిని క్రూరమైన గ్రహం అని అంటారు కానీ నిజానికి మన పాప కర్మలను బట్టి శని మనకు పరీక్షలు పెడతాడు. ముఖ్యంగా సూర్య, చంద్ర ,అంగారక గ్రహాలు అధిపతులుగా ఉన్న రాశి వారికి ఏలినాటి శని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది అని అంటారు.
ఎటువంటి వారు అయినా శని ప్రభావం తమ జీవితంలో పడకుండా ఉండాలి అన్నా…గ్రహ దోషాలు వంటివి లేకుండా ఉండాలి అంటే రావి చెట్టు కింద నువ్వుల నూనె లేక ఆవు నూనెతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. ప్రతిరోజు స్నానమాచరించిన తర్వాత రావి చెట్టుకు 11 ప్రదక్షిణలు చేస్తూ…ఓం నమో భగవతే వాసుదేవాయ అనిస్మరిస్తూ భక్తిగా ఆరాధించాలి. హనుమాన్ చాలీసా లేక సుందరకాండ రావి చెట్టు కింద కూర్చుని పారాయణం చేయడం ఎంతో మంచిది. శనివారం శని దేవుడికి సంబంధించిన వస్తువులను దానం ఇవ్వడం వల్ల కూడా ఈ దోషం యొక్క ఫలితం చాలా వరకు తగ్గుతుంది.