Ads
ఒక సినిమా హిట్ లేదా ప్లాప్ అనేది ప్రేక్షకులు ఇచ్చిన తీర్పుని బట్టే ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. వీటిలో కొన్ని తొలిరోజు నుండే పాజిటివ్ టాక్ తో హిట్ అవుతాయి. మరికొన్ని సినిమాలు ఫస్ట్ డే పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ చివరికి వచ్చేసరికి ప్లాప్ గా మిగిలిపోతాయి.
Ads
ఇక కొన్ని చిత్రాలు తొలి రోజు నెగటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికి, అంచనాలకు విరుద్ధంగా చివరికి బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి. ఇక అలాంటి మూవీస్ కూడా ఉన్నాయి. అలా మొదటిరోజు ప్లాప్ టాక్ వచ్చి, బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రాలు ఏమిటో చూద్దాం..
జల్సా:
డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా. ఈ సినిమా 2008లో విడుదల అయ్యింది. అయితే తొలిరోజు నెగటివ్ టాక్ తెచ్చుకుంది. చివరకు ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
జనతా గ్యారేజ్:
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ 2016లో ఆడియెన్స్ ముందుకు వచ్చింది.అయితే ఈ మూవీ కూడా ఫస్ట్ డే నెగటివ్ టాక్ వచ్చినా, చివరకు సూపర్ హిట్ గా నిలిచింది.
సరైనోడు:
బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్నటించిన ఈ సినిమా 2016లో విడుదల అయ్యింది. మొదటి రోజు ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చినా, ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.జై సింహ:
బాలకృష్ణ హీరోగా కె ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ 2018లో సంక్రాతి పండక్కి రిలీజ్ అయ్యి, ఫస్ట్ డే నెగటివ్ టాక్ వచ్చింది. చివరకు సూపర్ హిట్ గా నిలిచింది.
సరిలేరు నీకెవ్వరూ:
2020లో మహేష్ బాబు,అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ సినిమాకు కూడా మొదట నెగటివ్ టాక్ ను వచ్చినా, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
పుష్ప ది రైజ్:
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీకి ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ వచ్చింది.
బంగార్రాజు:
తండ్రీకొడుకులైన నాగార్జున, నాగచైతన్య హీరోలుగా వచ్చిన ఈ సినిమా కూడా ఫస్ట్ డే నెగటివ్ టాక్ వచ్చినా, హిట్ గా నిలిచింది.
సర్కారు వారి పాట:
మహేష్ బాబు,పరశు రామ్ కాంబోలో సమ్మర్ కానుకగా వచ్చిన ఈ సినిమా కూడా తొలిరోజు మిక్స్డ్ టాక్ ను వచ్చినా, సూపర్ హిట్ గా నిలిచింది.
Also Read: టాలీవుడ్ లో టాప్ 8 రిచెస్ట్ యాక్టర్లు మరియు వారి నికర విలువల లిస్ట్..!