Ads
దేవీ నవరాత్రులను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. అతిపెద్ద పండుగలలో ఇది ఒకటి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా, వారి సంప్రదాయాల ప్రకారం దుర్గమాతను ఆరాధిస్తూ, పూజిస్తూ నవరాత్రులను ఘనంగా జరుపుకుంటారు.
ఈ ఏడాది కూడా నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ సమయంలో ఎంతో మంది భక్తులు అమ్మవారిని పూజిస్తూ, ఉపవాసం చేస్తుంటారు. తొమ్మిది రోజులు ఉపవాసం చేస్తారు. ఈ ఉపవాస సమయంలో తినకూడని ఆహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించే భక్తులు, ఉపవాసం చేసే భక్తులు సాత్వికాహారాన్నీ తినాలని చెబుతారు. సాత్వికాహారం అంటే శాఖాహారం అయినప్పటికీ, ఫాస్టింగ్ చేసేటపుడు కొన్ని ఆహారపదార్ధాలకి దూరంగా ఉండాలని చెబుతున్నారు. సాధారణంగా అయోడైజ్డ్ సాల్ట్ లేదా టేబుల్ సాల్ట్ ను వంటలలో వాడుతుంటాము. కానీ నవరాత్రి ఉపవాస వ్రతం చేస్తున్నప్పుడు ఈ సాల్ట్ కు బదులు రాక్ సాల్ట్ వాడినట్లయితే ఆరోగ్యానికి మంచిది.
సాధారణంగా పప్పులు తినడం వల్ల గ్యాస్, అధిక ఉబ్బరం కలుగుతుంది. అందువల్ల వాటికి దూరంగా ఉండాలి. ఉల్లిపాయ, వెల్లుల్లికి ఉపవాసం చేస్తున్నప్పుడు దూరంగా ఉంటారు. ఎందుకంటే వెల్లుల్లి తినడం వల్ల కోరికలు కలిగిస్తాయని నమ్ముతారు. ఉల్లిపాయ శరీరంలో వేడిని పుట్టేలా చేస్తుందని అప్పుడు దృష్టి ఆధ్యాత్మిక స్థితి నుంచి మరలి, ప్రాపంచిక అంశాల పైకి వెళ్తుందని నమ్మకం. అందువల్లే నవరాత్రుల ఉపవాసం చేస్తున్నప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లి తీసుకోవడం నిషేధించబడింది.
నవరాత్రులలో పూర్తిగా శాఖాహారం తీసుకోవాలి. ఈ సమయంలో మాంసాహారానికి పూర్తిగా మానుకోవాలి. మాంసం, చేపలు, గుడ్లు పూర్తిగా ఉపవాసం సమయంలో తీసుకోకూడదు. శాకాహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఇక ఉపవాసం చేసే టైమ్ లో మనం తీసుకునే ఆహారం జీర్ణం అవడానికి సమయం పడుతుంది. అయితే శాకాహారం తినడం ద్వారా జీవక్రియ రేటు పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. సాత్వికాహారం తీసుకోవడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుందని అంటారు.
ఉపవాస సమయంలో ఇన్‌స్టాంట్ ఫుడ్‌ల లేదా ప్రాసెస్డ్ ఫుడ్ తినకూడదు. ఉపవాసం ఉన్న సమయంలో పొట్ట ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో అధికంగా చక్కెర, ఉప్పు ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ ఫుడ్ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం కానీ, తగ్గడం జరుగుతుంది.
Ads
Also Read: ఏలినాటి శని అంటే అంటే.? దాని నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి.?