అసలు ఎవరు ఈ ముఖేష్ గౌడ..? ఎందుకు అతనికి ఇంత ఫ్యాన్ బేస్ ఉంది..?

Ads

‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీరియల్ ద్వారా రిషి పాత్రలో ముఖేష్ గౌడ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. రిషి పాత్రలో అద్భుతంగా నటించిన ముఖేష్ గౌడ ఎంతోమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు.

సీరియల్ ద్వారా సక్సెస్ అందుకున్న ముఖేష్ కు ఆ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆయన నటన, ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ముఖేష్ కు సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. గీత శంకరం అనే మూవీలో హీరోగా నటిస్తున్నారు. ముఖేష్ గౌడ గురించిన వివరాలు ఇప్పుడు చూదాం..
ముఖేష్ గౌడ  1994లో కర్ణాటకలోని మైసూర్‌లో నవంబర్ 8న జన్మించాడు. మైసూర్‌లోని మహావీర్ విద్యా మందిర్‌లో పాఠశాలలో ప్రాధమిక విద్యను అభ్యసించాడు. ఆ తరువాత మైసూర్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ముఖేష్ మోడలింగ్‌లో కెరీర్ ప్రారంభించాడు. 2015లో మిస్టర్ కర్ణాటక టైటిల్‌ను గెలుచుకున్నాడు.
2017లో టెలివిజన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ముఖేష్, తొలిసారిగా ‘నాగకన్నికే’ కన్నడ సీరియల్ లో నటించాడు. ఆ తర్వాత వర్ష హెచ్‌కేతో కలిసి ‘నాగమండల’ అనే మరో కన్నడ సీరియల్ లో నటించాడు.అతని నటన చూసి, తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ నుండి ఆఫర్ వచ్చింది. అలా తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ‘ప్రేమ నగర్’ సీరియల్ తో అడుగుపెట్టాడు. ఈ సీరియల్ ఇటీవీలో ప్రసారం అయ్యేది. ఆ తరువాత స్టార్ మాలో  ‘గుప్పెంత మనసు’ సీరియల్‌లో అవకాశం వచ్చింది.

Ads

రిషి సర్ గా నటించిన ముకేష్ కు అమ్మాయిల్లో, సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. అతనికి వెండి తెరపై కూడా అవకాశాలు వస్తున్నాయి. గీత శంకరం అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. కొత్త డైరెక్టర్ రుద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను దీపావళి సందర్భంగా రిలీజ్ చేశారు.

Previous articleఛీఛీ… ఫ్యామిలీ అంతా కలిసి చూసే టీవీ షోలో ఇలా చేయడం ఏంటి..? ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు..?
Next article“సుచిత్ర చంద్రబోస్” నుండి… “విజయ్ బిన్నీ” వరకు… డైరెక్టర్లుగా మారిన 10 “కొరియోగ్రాఫర్లు” వీరే..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.