Ads
కలియుగ దైవంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధిగాంచిన విషయం అందరికి తెలిసిందే. వెంకన్నను భక్తులు అడిగిన కోరికలను తీర్చే స్వామిగా కొలుస్తారు. కలియుగ వైకుంఠంగా తిరుమలను పిలుస్తారు.
Ads
నిత్య కళ్యాణకారుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి హస్తాలు ఉండే తీరు అందరికి తెలుసు. అయితే ఒక్క తిరుమలలోనే కాకుండా, ప్రపంచంలో ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ, విగ్రహం అయిన నిలబడి ఉన్నట్టుగానే దర్శనమిస్తుంది. అంతేకాకుండా ఆయన నాలుగు హస్తాలలో రెండు హస్తాలు పైకి, రెండు హస్తాలు కిందకు ఉంటాయి.వెంకటేశ్వర స్వామికి పైకి ఉన్న రెండు హస్తాల్లో కుడి హస్తం సుదర్శన చక్రాన్ని పట్టుకుని ఉంటుంది. ఇక ఎడమ హస్తంలో పాంచజన్యం కనిపిస్తుంది. ఇలా ఉండడానికి అర్ధం ఏమిటి అంటే వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులతో పాటుగా, ఏమి తెలియని అమాయకులకు హానిచేయాలని చూసినపుడు, వెంటనే ఆయన సుదర్శన చక్రాన్ని దుర్మార్గుల పైకి విడిచి భక్తులను కాపాడుతాడని అర్థం. ఇక మానవజాతికి ఆపద వచ్చినప్పుడు పాంచజన్యంను పూరించి, సుదర్శన చక్రంతో శత్రువులను అంతం మోందిస్తాడని అర్థం.ఇక కింది వైపు ఉన్న రెండు హస్తాల్లో కుడి హస్తం సగం వరకు మడిచి, ఎడమ హస్తం అరచేయి కింది వైపుకు ఉంటుంది. వేదాలలో చెప్పిన ప్రకారం దీనిని వరద హస్త ముద్ర అని అంటారు. కలియుగంలో తిరుమల కొండ మీద ఉండి, భక్తులను కాపాడుతానని, తనను శరణు అనేవారిని రక్షిస్తానని, వారి కున్న కష్టాలను తొలగిస్తాను అని అర్థం. అంతే కాకుండా భక్తులకు వరాలను ఇస్తాడని అర్థం.
Also Read: ఏడాదికి రెండు సార్లు ఎందుకు హనుమాన్ జయంతిని జరుపుకోవాలి..? కారణం ఏమిటో తెలుసా..?