Ads
సుధీర్ బాబు హీరోగా నటించిన హరోం హర సినిమా రేపు విడుదల అవుతుంది. సినిమా బృందం ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. సినిమా కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ గా అనిపిస్తోంది. ఇటీవల ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ మీద, సుమంత్ జి నాయుడు ఈ సినిమాని నిర్మించారు. సెహరి సినిమాకి దర్శకత్వం వహించిన జ్ఞాన సాగర్ ద్వారక ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మాళవిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. సునీల్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు.
చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. అయితే సినిమా ఫస్ట్ టాక్ బయటికి వచ్చేసింది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగున్నట్టు సమాచారం. ఫస్ట్ హాఫ్ లో మొదటి 15 నిమిషాలు సినిమాకి చాలా కీలకం అని అంటున్నారు. అంత కీలకమైన ఎపిసోడ్ ని చాలా బాగా డిజైన్ చేశారట. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా ఆసక్తి కలిగించే విధంగా ఉంటుంది అని అంటున్నారు. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లాగానే బాగా రాసుకున్నారు అని, స్క్రీన్ ప్లే చాలా బాగుంది అని అంటున్నారు. క్లైమాక్స్ కాస్త తెలిసే విధంగా ఉన్నా కూడా సినిమా అంతా ఆసక్తికరంగా నడుస్తుంది అని టాక్ బయటకు వచ్చింది.
Ads
మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే. సినిమా బృందం సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమా ప్రేక్షకులకి నచ్చుతుంది అని నమ్మకంగా ఉన్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు సుధీర్ బాబు. ప్రతి సినిమాకి తనని తాను మార్చుకుంటూ ఉంటారు. సుధీర్ బాబు మామా మశ్చీంద్ర సినిమాలో చాలా కొత్తగా కనిపించారు. ఇప్పుడు ఈ సినిమాలో ఇంకా కొత్తగా కనిపిస్తున్నారు. సినిమా నుండి విడుదల అయిన పాటలు మంచి స్పందన అందుకున్నాయి. దాంతో ఇప్పుడు సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.