Ads
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మిచౌంగ్ తుఫానుగా తీవ్ర రూపం దాల్చింది. ఈ తుఫాన్ ప్రభావం వల్ల తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ లలో రెండు రోజులగా భారీ వర్షాలు పడుతున్నాయి.
ముఖ్యంగా చెన్నైలో ఆదివారం రాత్రి నుండి కుండపోత వర్షం ఏడతెరపి లేకుండా కురిసింది. దీంతో సోమవారం మధ్యాహ్నా సమయానికి చెన్నై, చుట్టుపక్కల జిల్లాల్లో 35 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షానికి చెన్నైలోని పలు ఏరియాలు నీటిమునిగాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మిచౌంగ్ తుఫాను వల్ల తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తమిళనాడు రాజధాని అయిన చెన్నైలో ఎటు చూసినా నీటితో నిండిపోయింది. చెన్నైతో పాటు శివారు జిల్లాలలో అధిక వర్షపాతం నమోదు అయ్యింది. దీంతో పలు ఏరియాలలోని వీధులన్నీ వాగులు అయ్యాయి. చెన్నైలో వరదలు పోటెత్తుతున్నాయి. ఇళ్లు మరియు పార్కింగ్ ప్లేస్ లలో ఉన్న వందలాది వాహనాలు ఆ వరదల్లో కొట్టుకుపోయాయి. భారీ వర్షాల వల్ల సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి ప్రముఖులు నివసించే పోయెస్ గార్డెన్ హైవే ఏడు అడుగుల వరకు కుంగినట్టు తెలుస్తోంది.
నేషనల్ హైవే వరద నీటిలో మునిగిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. అంతే కాకుండా చెన్నై ఎయిర్ పోర్ట్ లోకి వరద నీరు చేరింది. దాంతో మంగళవారం ఉదయం వరకు ఎయిర్ పోర్ట్ ని మూసేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. కానీ మంగళవారం ఉదయం కూడా ఎయిర్ పోర్ట్ లో వరద నీరు ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో 160 విమాన సేవలు క్యాన్సిల్ అయ్యాయి. ఇంకో 33 సర్వీసులను బెంగళూరు వైపుకు దారి మళ్లించారు. తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్ట జిల్లాలో కూడా తుపాను ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంది.
తాజాగా కురిసిన వర్షం గత 47 సంవత్సరాలలో చెన్నై సిటీలో కురిసిన అత్యంత భారీ వర్షంగా నమోదు అయ్యింది. 2015లో చెన్నైలో పడిన భారీ వర్షం కన్నా ఎక్కువ కురిసింది. ఆ సమయంలో కూడా చెన్నైలోని చాలా ప్రాంతాలు నీటలో మునిగాయి. ప్రజల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. అయితే మిచాంగ్ తుపాను కారణంగా అప్పటికన్నా ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యి, బీభత్సాన్ని సృష్టించింది. మంగళవారం కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు పడే అవకాశం కలదని వాతావరణ శాఖ వెల్లడించింది.
Ads
Also Read: విశాఖపట్నంలో బెస్ట్ ప్లేస్ అంటే ఇదే..! కానీ దీని పరిస్థితి ఇలా అయిపోయిందేంటి..?