Ads
సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాని మరో హీరో చేయడం సర్వసాధారణం. అటువంటి సమయంలో ఆ సినిమా సూపర్ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ ఎన్టీఆర్ కన్నా ముందు వేరే హీరో వద్దకు వెళ్లిందట. అయితే ఆ హీరో సినిమా రిజెక్ట్ చేశాడని టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమా ఒప్పుకుని సినిమా మొదలు పెట్టారు.
అయితే ఈ సినిమాను రిజెక్ట్ చేసిన హీరో ఎవరు అంటే ఆరాలు తీస్తున్నారు.ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు…ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.కొరటాల శివ ముందుగా ఈ కథను అల్లు అర్జున్ కి వినిపిస్తే కొన్ని కారణాలతో ఆయన ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. గతంలో అల్లు అర్జున్ కొరటాల కాంబినేషన్ లో సినిమా ప్రకటన కూడా వచ్చి ఒక పోస్టర్ విడుదల చేశారు. అది ఈ సినిమా కథే అని పలువురు అంటున్నారు.
Ads
అయితే తాజాగా దేవర మూవీ టీజర్ విడుదలైంది. అద్భుతమైన క్వాలిటీ విఎఫ్ఎక్స్ తో దేవర టీజర్ కనిపించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ క్యారెక్టర్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది అని అంటున్నారు. సినిమా చాలా మటుకు మహాసముద్రంలో జరుగుతుందో. బ్లడ్ అండ్ బాత్ అండ్ సినిమా ట్యాగ్ లైన్ గా చెప్పుకుంటున్నారు.కొరటాల శివ ఆచార్య ఫ్లాప్ తరువాత ఈ సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మొదటి పార్ట్ ఏప్రిల్ 5వ తారీఖున విడుదల కానుంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాలో నిర్మిస్తున్నారు.