Ads
తన అమాయకమైన చూపులతో…చల్లటి నవ్వుతో… ప్రేక్షకుల మనసులకు లంగరు వేసి లాగే నటి లైలా.’దుష్మన్ దునియా కా’ అనే ఒక హిందీ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది లైలా. హిందీలో ఎంట్రీ ఇచ్చింది కానీ తనకు స్టార్‌డమ్ వచ్చింది మాత్రం సౌత్ సినిమాల తోటే. ముఖ్యంగా 1997లో విడుదలైన ఎగిరే పావురమా చిత్రం తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన లైలా ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది.
పెళ్లి చేసుకుందాం, పవిత్ర ప్రేమ, శుభలేఖలు, నా హృదయంలో నిదురించే చెలి, మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి.. ఇలా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. కెరియర్ మంచి దశలో ఉండగా బిజినెస్ మాన్ మెహ్దీని ను గాఢంగా ప్రేమించిన లైలా ఎనిమిదేళ్లపాటు మంచి లవ్ లైఫ్ ఎంజాయ్ చేసి ఆ తరువాత 2006లో పెళ్లి చేసుకుని సినీ ఇండస్ట్రీకి దూరమైంది.
Ads
పెళ్లి తర్వాత కెరీర్ కు బై బై చెప్పిన లైలా తిరిగి 2022లో సర్దార్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. అందులో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది చిన్న రోల్ అయినప్పటికీ సినిమాలో చాలా వెయిటేజ్ ఉన్న రోల్ అది. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన లైలా తన కెరియర్ లో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 2001 లో “నందా” మూవీ చేసేటప్పుడు లైలాకు తమిళ్ పెద్దగా మాట్లాడడం రాదట. ఇంకేముంది డైలాగుల్లో చాలా తప్పులు వచ్చేవట…దీంతో డైరెక్టర్ బాల ఆమెను పదే పదే తిట్టేవాడట. ఒక టైం లో విపరీతమైన కోపం రావడంతో లైలా ఇక నేను ఈ సినిమా చేయను అని డైరెక్టర్ తో డైరెక్ట్ గా చెప్పేసిందట.
కానీ తర్వాత కొంతమంది బాల మంచి డైరెక్టర్ అని.. తన డైరెక్షన్లో మూవీ చేస్తే ఫ్యూచర్ లో మంచి గుర్తింపు వస్తుందని లైలాకు నచ్చజెప్పడంతో కోపం తగ్గించుకొని సినిమాలో నటించిందట. తీరా సినిమా రిలీజ్ అయ్యాక జనాల రెస్పాన్స్ చూడడానికి ఫస్ట్ డే థియేటర్ కి వెళ్లిన లైలా స్క్రీన్ పై తన నటన చూసి ఇంత బాగా నటించానా ? అని షాక్ అయిందట. దాంతో వెంటనే బాలా సార్ దగ్గరకు వెళ్లి మరి క్షమించమని కాళ్లపై పడిందట. నందా మూవీకి గాను ఆమెకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది మరి.