Ads
యువ సామ్రాట్ నాగ చైతన్య ఈమధ్య వరుస ప్లాపులను అందుకుంటున్నారు. ఈ మధ్య దూత అనే వెబ్ సిరీస్ తో ఒక మంచి హిట్ ను సాధించాడు. కానీ సినిమాలలో నాగచైతన్య మంచి కంబాక్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
nc23 అని సినిమా పేరు కూడా చెప్పకుండా ఇప్పటివరకు నాగచైతన్య తర్వాత సినిమా పేరు దాస్తూ వచ్చారు చిత్ర బృందం. అయితే చందు ముందేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయకగా ఎంపికైంది అన్న సంగతి మనకి తెలిసిందే.
లవ్ స్టోరీ సినిమా తర్వాత వీళ్ళిద్దరూ మళ్లీ ఇంకొక సినిమాలో నటిస్తున్నారు అనగానే ప్రేక్షకులలో ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటాయి. వీళ్లిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అయితే ఈ సినిమాలో కూడా అలాగే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. తండేల్ అనే పేరుని ఈ చిత్రానికి ఎంపిక చేశారు చిత్ర బృందం. ఈ విషయాన్ని కూడా తాజాగానే అనౌన్స్ చేశారు. రీసెంట్ గానే ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయింది అనే విషయాన్ని కూడా ప్రకటించారు చిత్ర బృందం.
Ads
అయితే ఈ చిత్రం కోసం నాగచైతన్య, చందు మొండేటి ఎంతో రీసెర్చ్ చేశారని, శ్రీకాకుళం బీచ్ బ్యాక్ గ్రౌండ్ తో వస్తున్న ఈ సినిమా కోసం 6 నెలలు కష్టపడి ప్రతి విషయాన్ని గమనించి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో సాయి పల్లవికి సోదరిగా నటిస్తున్న భామ ఎవరో తెలుసా? తను ఇంకెవరో కాదు రీసెంట్ గా మంగళవారం సినిమాల్లో జమిందార్ భార్యగా నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న దివ్య పిళ్లై. మంగళవారం సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న దివ్య ఈ సినిమాలో సాయి పల్లవికి సోదరిగా నటించనుంన్నదట.
ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని తెలిసిన వెంటనే తను ఎంతో ఎక్సైట్ అయిందట. ఈ సినిమాలో వర్క్ చేయడం కోసం తను ఎంతో టైం వెయిట్ చేసిందట. ఈ సినిమాలో సాయి పల్లవి నాగచైతన్య పాత్రతో ప్రేమలో పడిపోతుందట తనకోసం తను స్టాండ్ తీసుకునే క్యారెక్టర్ లో ఉంటుందట సాయి పల్లవి. మరి ఈ చిత్రంలో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో తెలియాలి.
కార్తికేయ, కార్తికేయ 2, ప్రేమమ్ వంటి మంచి హిట్లను ఇచ్చిన చందు మొందేటి నాగచైతన్య కెరీర్ లోనే అతి పెద్ద బడ్జెట్ తో సినిమా తీస్తున్నారు అనగానే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి అక్కినేని అభిమానుల నుంచి. అయితే ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీ లో పెద్ద సెట్టే వేశారట. ఈ సినిమాతో అయినా నాగచైతన్య కంబాక్ ఇస్తాడని ఆశిస్తున్నారు ప్రేక్షకులు.