Ads
నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లు లేటెస్ట్ మగా నటిస్తున్న సినిమా ‘హాయ్ నాన్న’. ఈ చిత్రాన్ని డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మోహన్ చెరుకూరి కలిసి ‘వైర ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాని కొత్త దర్శకుడు శౌర్యవ్ తెరకెక్కించాడు.
తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదల అయ్యింది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ డిసెంబర్ 7న రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ రీమేక్ అంటూ ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
హీరో నాని నటిస్తున్న 30వ సినిమా హాయ్ నాన్న. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా, శృతి హాసన్ కీలక పాత్రలో నటించింది. తండ్రి కూతుర్ల సెంటిమెంట్ తో ఈ మూవీ తెరకెక్కిందని మూవీ యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ మూవీ రీమేక్ అనే ప్రచారం నెట్టింట్లో వైరల్ గా మారింది. హాయ్ నాన్న గతంలో వచ్చిన తెలుగు మూవీకి రీమేక్ అని కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.
హాయ్ నాన్న మూవీ స్టోరీ హీరో నాగార్జున నటించిన సంతోషం మూవీ నుంచి తీసుకున్నారని టాక్. సంతోషం మూవీలో నాగార్జున, గ్రేసీ సింగ్ లవ్ చేసుకుని, పెద్ద వాళ్ళు అంగీకరించకుంటే బయటకు వెళ్లిపోయి, పెళ్లి చేసుకుంటారు. వారికి ఒక బాబు పుట్టిన తరువాత గ్రేసీ సింగ్ చనిపోతుంది. ఆ తరువాత వాళ్ళింటికి వెళ్ళడం అక్కడ శ్రియ, బాబుకి, నాగార్జునకి దగ్గరవడం, నాగార్జునను ప్రేమించడం, మూవీ చివర్లో శ్రియ హీరోని పెళ్లి చేసుకుంటుంది.
హాయ్ నాన్న నుంచి రిలీజ్ అయిన టీజర్, పాటలు చూస్తే సంతోషం మూవీ స్టోరీనే గుర్తుకు వస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీలో శృతి హాసన్ అతిథి పాత్ర అంటే నాని భార్యగా, చనిపోయినట్టుగా చూపిస్తారేమో అని అంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన తమిళ్ మూవీ దాదా కూడా ఇలాగే ఉందని అంటున్నారు. అయితే మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న నాని టీమ్ మాత్రం ‘హాయ్ నాన్న’ ఒరిజినల్ స్క్రిప్ట్ అని చెప్పుకొచ్చారు.
Ads
watch video:
Also Read: BHAGAVANTH KESARI REVIEW : “భగవంత్ కేసరి”తో బాలయ్య హిట్ కొట్టారా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!!