Ads
తెర మీద చూసినంత తేలిక కాదు సినిమాను తీయడం అంటే. ఒక సినిమాను షూట్ చెయ్యాలి అంటే స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా ఉండాలి.ఇక రాసుకున్న స్క్రిప్ట్ కి తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించాలి.
Ads
ఇక స్క్రిప్ట్ ని ఫాలో అవడంలో కానీ, చిత్రీకరణ అనుకున్నట్టు రాకపోయినా, తేడా వచ్చినా రీ షూట్ కి వెళ్ళాల్సిందే. అప్పటి వరకు సన్నివేశం కోసం పెట్టిన ఖర్చు వృధానే. సన్నివేశాలలో ఆహారం తినే సన్నివేశాలు షూట్ చేయడం కూడా ఒక రకంగా కష్టమనే చెప్పాలి. ఎలా అంటే చపాతీలు, ఇడ్లిలు లాంటివి తింటున్నట్లు చూపెట్టే సన్నివేశాలలో నతినటులు టేకులు ఎక్కువ తీసుకునే పక్షంలో తినే ఫుడ్ ని మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. ఇలా అవసరమైన దానికన్నా ఫుడ్ ని ఎక్కువగా తెప్పించాల్సి వస్తుంది.అలా కాకుండా ఫుడ్ షాట్స్ అన్నింటిలో ఒకేలా కనిపించకపోతే ఆడియెన్స్ కు తెలుస్తుంది. ఇక ఫుడ్ ఐటమ్స్ కాబట్టి ఇడ్లిలు, చపాతీలు లాంటి వాటిని చాలా సులభంగా గుర్తు పెట్టేస్తారు. పిజ్జా, బర్గర్లు తినే సన్నివేశాలయితే ఎక్కువే తెప్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి షాట్ లో కూడా అన్ని ఒకేవిధంగా కనిపించాలి కదా. రజినీకాంత్, శ్రియ నటించిన శివాజీ సినిమాలో ఒక ఫుడ్ సీన్ ఉంటుంది. హీరోయిన్ శ్రియ కుటుంబం, రజినీకాంత్ ఇంటికి వెళ్ళినపుడు అక్కడ డైనింగ్ టేబుల్ మొత్తం రకరకాల ఫుడ్ ఐటమ్స్ తో నింపేస్తారు.
అయితే ఈ సీన్ కోసం లే మెరిడియన్ హోటల్ నుండి పదిహేడు వేలరూపాయల ఫుడ్ ని ఆర్డర్ చేసి తెప్పించారట. కానీ ఈ సన్నివేశంలో నటించిన ఎవరు కూడా 2 స్పూన్ల కంటే ఎక్కువ ఆహరం తీసుకోలేదు. ఆ సన్నివేశాల చిత్రీకరణ కామెడీ ట్రాక్ పైనే నడుస్తుంది. ఇక ఈ సీన్ చిత్రీకరణ పూర్తి అయ్యాక వాడిన ఫుడ్ ని ఏమి చేసారంటే, సెట్ లో ఉన్న టీం సభ్యులకి, స్పాట్ బాయ్స్ కి పెడతారు. ఇక ఇలా ఫుడ్ సన్నివేశాలను ఎప్పుడైన షూట్ చేయాలంటే వన్ డేలోనే పూర్తి చేయాలి. లేకపోతే అదే ఆహారాన్ని, అంతే మొత్తంలో పెట్టకపోతే కంటిన్యూటీ మిస్ అవుతుంది.
Also Read: రజినీకాంత్, చిరంజీవి మల్టీస్టారర్ మూవీ ఏ నిర్మాత వల్ల మిస్ అయ్యిందో తెలుసా?