Ads
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. వారు ఎంత అన్యోన్యంగా ఉన్నప్పటికి, ఏదో ఒక విషయంలో గొడవ అనేది వస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు గొడవలు అయినా కాసేపటికే సర్దుకుంటాయి.
అయితే కొన్ని సార్లు మాత్రం భార్యాభర్తల గొడవలు తీవ్రం అవుతాయి. అవి కొట్టుకోవడానికి కూడా దారి తీస్తుంది. తాజాగా భార్యాభర్తలు ఒకరిపై ఒకరు చేయిచేసుకునే వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాలే భార్యాభర్తల మధ్య పెద్ద గొడవలగా మారడం సాధారణం అయిపోయింది. చిన్న మాటకే ఆర్గ్యుమెంట్ కి దిగడం అలవాటుగా మారింది. ఆ తర్వాత ఇద్దరు సర్దుకుని మళ్ళీ కలిసిపోతున్న విషయం కూడా తెలిసిందే. కొన్ని గొడవలు విడాకులకు దారి తీస్తున్నాయి. కొన్ని మిస్టేక్స్ ను చూసి చూడనట్లు కొందరు భార్య భర్తలు వదిలేస్తూ ఉంటారు. కానీ ఒక స్త్రీ మాత్రం ఆమె భర్తను అందరి ముందే రైల్వే స్టేషన్ లోనే చితక్కొట్టింది. ఒకప్పుడు ఇలాంటివి ఇంటికి, వీధికి మాత్రమే పరిమితం అయ్యేటివి.
కానీ ఈ మహిళ బహిరంగంగానే తన భర్తను కొట్టడంతో ఎవరో వీడియో తీసి ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ వీడియోలో, రైల్వే స్టేషన్‌లో ఒక వ్యక్తి భార్య వద్దకు వెళ్ళి, ఏదో మాట్లాడుతాడు. అయితే ఆ భర్త ఏం ఏమన్నాడో కానీ, ఆ భార్యకు కోపం వచ్చి, వెనకాకు తిరిగి చేత్తో భర్త ఫేస్ పై కొట్టింది. ఆ తరువాత అతన్ని ఒక్కసారిగా పై కెత్తి కింద పడేసి, అతడి చితకబాదింది.
ఈ దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. ఆ మహిళ భర్తను కొడుతుందని తెలిసి నోరెళ్లబెట్టారు. ఆ మహిళను ఆపడానికి ఒక్కరు కూడా సాహసం చేయలేకపోయారు. కొందరు ఈ సీన్ ను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి స్త్రీని తాము ఎక్కడా చూడలేదంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
Ads
Hi @bisping 👋, where does this take down stand is your top 10 list? #ufc pic.twitter.com/LrhTalD2pK
— Bharat (@2673Bharat) November 3, 2023
Also Read: ప్రియుడిని ఇంటికి పిలిచింది…చివరికి దొరికిపోయేసరికి చెప్పుతో కొట్టి ఎలా ప్లేట్ ఫిరాయించింది అంటే..?