Ads
వివాహ బంధం అనేది కేవలం ఒక వ్యక్తి అడ్జస్ట్మెంట్ మీద ఆధారపడి ఉండే బంధం కాదు. ఇరుపక్కల ప్రేమాభిమానాలు లేకపోతే ఇనుప పంజరం వివాహ బంధం కంటే సుఖం అనిపిస్తుంది. అదిగో అటువంటి బంధానికి ఉదాహరణగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక కథ గురించి తెలుసుకుందాం.అదే బాధను అనుభవించిన ఒక భార్య విడాకులు కోరిన భర్తని అడిగిన రెండే రెండు కోరికలు.. ఈనాడు సమాజంలో భార్యాభర్తల బంధం ఏ వైపు వెళ్తుందో అన్న ప్రశ్నను కలిగించక మానదు.
ఆఫీసులో మరో మహిళ ప్రేమలో పడ్డ భర్త తన భార్యను విడాకులు ఇమ్మని కోరుతాడు. గత కొద్ది కాలంగా తమ వివాహ బంధంలో ఏర్పడుతున్న ఒడిదుడుకులకు, భర్త చూపిస్తున్న విసుగుకు కారణం తెలుసుకున్న భార్య కలత చెందుతుంది. ఏం చేయాలో తోచని స్థితిలో ఒక రోజంతా ఆలోచించి ఆమె విడాకులు ఇవ్వడానికి తన సముఖతను తెలుపుతూ భర్త ముందు రెండే రెండు కండిషన్స్ పెడుతుంది. ఆస్తిపాస్తులు అడుగుతుంది అని ఊహించిన ఆ భర్త భార్య అడిగిన ఆ రెండు కోరికలు విని మొదట తీవ్రమైన షాక్ కి గురి అయ్యాడు.
ఇంతకీ ఆమె అడిగినా రెండు కోరికలు ఏమిటో తెలుసా.. ఒక నెల రోజులపాటు విడాకుల ప్రసక్తి లేకుండా సాధారణమైన జీవితాన్ని గడపడం, రోజు తమ బెడ్ రూమ్ నుంచి హాల్ వరకు పెళ్లయిన కొత్తలో లాగా తనను ఎత్తుకొని తీసుకురావడం. ఆమె చెప్పిన విషయాలు విడ్డూరంగా ఉన్నప్పటికీ కొడుకు పరీక్షల సమయంలో విడాకుల గురించి చెప్పి అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని తండ్రి భార్య చెప్పిన ఆ రెండు షరతులకు ఒప్పుకున్నాడు.
Ads
షరతుల ప్రకారమే ఇద్దరు ఎప్పటిలాగే ఉంటూ వచ్చారు. అయితే క్రమంగా తన చేతిలో భార్య బరువు విపరీతంగా తగ్గుతున్నట్టు భర్త గమనించాడు. విడాకులు ఇవ్వకుండా ఉండడానికి వేస్తున్న నాటకం అని మొదటిలో భావించిన తరువాత అతని మనసులో ఎప్పుడో నిద్రపోయినా ప్రేమానురాగాలు మేల్కొన్నాయి. రోజురోజుకీ తన కళ్ళముందే దిగులుతో కుమిలిపోతున్న భార్య వేదన చూసి తట్టుకోలేక ఇక లవర్ కి టాటా ,గుడ్ బై చెప్పడానికి ఫిక్స్ అయిపోయాడు.
తన భార్యను వదిలి ఉండలేను అని లవర్ కి స్పష్టం చేసి భార్య కోసం ఒక ఫ్లవర్ బొకే కొని చావు మనల్ని వేరు చేసే వరకు నిన్ను జీవితాంతం ఇలానే మోస్తూ ఉంటాను అని ఒక లవ్ కోట్ రాయించి మరి తీసుకువచ్చాడు. అయితే ఇంటికి వచ్చిన భర్తకు మంచంపై చనిపోయిన భార్య కనిపించింది. అప్పుడు గాని అతనికి అసలు విషయం తెలియలేదు..
కొన్ని నెలలుగా క్యాన్సర్ తో బాధపడుతున్న భార్య భర్త విడాకులు కోరడం తో బతికిన నాలుగు రోజులు అతని ప్రేమానురాగాలు అనుభవించి చనిపోవాలి అని నిర్ణయించుకుంది. కొడుకుకి తండ్రి ఎంత మంచి భర్త ఉదాహరణగా చూపించాలని ఇలా చేసింది. అంతా అయిపోయాక అతను చింతించిన ఏమి లాభం చెప్పండి. మనలో చాలామంది కళ్ళ ముందు ఉన్న బంధాలను ఏదో సాధించాలి అని ఆత్రుతతో నిర్లక్ష్యం చేస్తాం. జారిపోతేనే బంధం విలువ తెలుస్తుంది అని పెద్దలు అంటారు అందుకే ఉన్నన్నాళ్ళు ఉన్న బంధాలను జాగ్రత్తగా నిలుపుకోండి.