Ads
మామూలుగా మనం ఏదైనా వాహనాలు నేర్చుకుంటున్నప్పుడు మనుషులు ఎవరూ లేని ప్రదేశంలో అలాగే తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే వాటిని నేర్చుకోవడం మొదలుపెట్టాలి. కానీ ప్రస్తుత రోజుల్లో అలా కాకుండా ఏకంగా నడిరోడ్లపై వచ్చి విన్యాసాలు చేస్తూ బైకులు నేర్చుకోవడం అనవసరమైన ప్రమాదాలను కొని తెచ్చుకోవడం లాంటివి చేస్తున్నారు. వారి ప్రాణాలతో పాటు పక్క వారి ప్రాణాలకి కూడా హాని కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఎప్పుడైనా కూడా వాహనం నేర్చుకుంటున్న సమయంలో పక్కన ఎవరైతే మనకు క్షణ ఇస్తూ ఉంటారో వారి మాటలు ఎప్పటికప్పుడు వింటూ ఉండాలి.
అలా వినకపోతే ఇలాగే జరుగుతుంది అన్న దానికి సోషల్ మీడియాలో ఒక వీడియోని ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఆ వీడియోలో ఆ మహిళ భర్త పక్కనే నిలబడి తన భార్యకు బైక్ నేర్పించడంతో పాటు ఆ దృశ్యాన్ని అంతా కూడా వీడియో తీస్తున్నాడు. చెప్పినట్టుగానే జాగ్రత్తగా బైక్ నడుపుతూ గేర్ బండిని మెల్లగా ముందుకు నడిపింది. తర్వాత యూటర్న్ తీసుకోవడానికి ప్రయత్నించింది. కానీ అక్కడే ఊహించని ప్రమాదం జరిగింది. బయట వస్తున్న విషయాన్ని మహిళ గమనించలేదు. దానికి తోడు ఆమె భర్త దూరం నుంచి బ్రేక్ వేయి అని ఎంత గట్టిగా అరుస్తున్నా కూడా ఆమె వినిపించుకోకుండా కంగారులో బ్రేక్ వేయలేకపోయింది. కానీ అతను ఎంత గట్టిగా అరిచినా కూడా లాభం లేకపోయింది.
ఎదురుగా వస్తున్న బైక్ ఆ మహిళ నడుపుతున్న బైక్ ను వేగంగా ఢీకొట్టడంతో ఆ మహిళా కొంచెం ఎత్తుకు ఎగిరి కింద పడిపోయింది. ఆ మహిళ నడుపుతున్న బైక్ ముందర భాగం కూడా డ్యామేజ్ అయినట్లు మనకు వీడియోలో కనిపిస్తుంది. ఆ ప్రమాదం జరగడంతో వెంటనే ఆ మహిళ భర్త వీడియో తీయడం ఆఫ్ చేసి ఆమె దగ్గరికి పరుగున వెళ్లిపోయాడు. అయితే చూడడానికి బాధ కలిగించేలా ఉన్న ఆ వీడియోని చూసి నెటిజెన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తూ ఫన్నీగా జోక్స్ వేస్తున్నారు.