Ads
దీపావళి పండుగ రోజున కట్టుకున్న భర్తే ఇల్లాలిని చంపిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ప్రేమించి, పెద్దలను ఎదురించి మరి పెళ్లి చేసుకున్న భార్యను కసాయి భర్త కడతేర్చిన ఘటన కుటుంబంలో విషాదం నింపింది.
టీవి 9 తెలుగు న్యూస్ కథనం ప్రకారం, నేరేడుమెట్ లో దీపావళి పండుగ రోజు ఈ ఘటన జరిగింది. వరంగల్ జిల్లాలోని గన్నారంకు చెందిన స్రవంతి, సిద్దిపేట జిల్లాలోని శ్రీగిరిపల్లికి చెందిన మహేందర్ తో పెళ్లి జరిగింది. మహేందర్, స్రవంతి 2019లో ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్నారు. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె ఉంది. గత ఏడాది నుండి ఉప్పల్ లోని జవహర్ నగర్ లో కందిగూడాలో ఉంటున్నారు.
మహేందర్ డ్రైవర్ గా పని చేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆర్థిక సమస్యలు తలెత్తడంతో తరచూ గొడవలు జరుగుతుండడంతో స్రవంతి కొద్ది రోజులుగా ఆమె తల్లిదండ్రుల దగ్గరే ఉంటోంది. ఈ క్రమంలో మహేందర్ శనివారం రాత్రి స్రవంతికి ఫోన్ చేసి, తాను ఇల్లు ఖాళీ చేస్తున్నట్టుగా చెప్పాడు. ఆమె ఆదివారం నాడు ఉదయం వారు అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో మహేందర్ తనకు సంబంధించిన వస్తువులు తీసుకొనివెళ్తుండడంతో స్రవంతి భర్త పై కోప్పడింది.
Ads
ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మహేందర్ కోపంతో భార్య తల పై, బలంగా కొట్టడంతో, స్రవంతి క్రిందపడింది. ఆ తరువాత ఆమె మెడకు చున్ని చుట్టి మంచం కింద దాచి, ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాడు. తన వస్తువుల్ని తీసుకురావడం కోసం వెళ్ళిన తన చెల్లి ఇంటికి రాకపోవడంతో ఆమె సోదరుడు ప్రశాంత్ ఆదివారం నాడు 1:30 గంటల ప్రాంతంలో వారు అద్దెకున్న ఇంటికి వెళ్లాడట.
కానీ ఇంటికి లాక్ చేసి ఉండడం చూసి, సందేహం రావడంతో తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్ళగా, అక్కడ అతని చెల్లి మరణించింది. పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే, మహేందర్ ను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. స్రవంతిని మరణంతో ఆమె కుటుంబ సభ్యులు దుఖంలో మునిగిపోయారు.
Also Read: ఏడాదిన్నర కాలంలో 37 మంది మృతి..హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలకు కారణం ఇదేనా.?